జగన్ మేనిఫెస్టోపై వైసీపీ సోషల్ మీడియా అతి!

Publish Date:Apr 27, 2024

Advertisement

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న వ‌ర్గీయుల అరాచ‌కం పీక్ స్టేజ్‌కు వెళ్లిపోయింది. వారి క్రియేటివిటీని చూసి ఏపీ ప్ర‌జ‌లు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఇదేంట్రా బాబు.. మ‌నం ఏమైనా పిచ్చోళ్ల‌మా అని చ‌ర్చించుకుంటున్నారు. ఇంత‌కీ  జ‌గ‌న‌న్న అంత మ‌తిపోయే ప‌ని ఏం చేశాడ‌ని అనుకుంటున్నారా..?  ఇన్నాళ్లు జ‌గ‌న‌న్న చేసిన‌వ‌న్నీ ప్ర‌జ‌ల‌కు మ‌తులు పోగ‌ట్టే ప‌నులే క‌దా.. ఇంకా కొత్త‌గా ఏముంది మ‌తిపోవ‌టానికి అనుకుంటున్నారా? తాజాగా వైసీపీ సోష‌ల్ మీడియా క్రియేటివిటీతో ఎవరికైనా మ‌తిపోవాల్సిందే. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైసీపీ మ్యానిఫెస్టోను శ‌నివారం (ఏప్రిల్ 27) విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఆ మ్యానిఫెస్టో విడుద‌ల స‌మ‌యంలోనూ తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబును తిట్ట‌డ‌మే ప‌నిగా జ‌గ‌న్ పెట్టుకున్నారు. చంద్ర‌బాబు పేద ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌లేద‌ట‌.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం దేశంలో ఏ ముఖ్య‌మంత్రి  చేయ‌లేనంత మంచి ప‌నులు పేద‌ల‌ కోసం చేశారంట‌. అడిగేవాడు లేక‌పోతే.. బెదిరించే వాడిదే రాజ్యం అన్న‌ట్లుగా మ్యానిఫెస్టో విడుద‌ల స‌మ‌యంలో జ‌గ‌న్‌ ప్రసంగం ఉంది.

 ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి తాను ఏం చేసినా ఎవ్వ‌రూ ప్ర‌శ్నించ‌కూడ‌ద‌నే స్వ‌భావంతోనే పాల‌న సాగించారు. ఐదేళ్ల కాలంలో ఆయ‌న్ను ప్ర‌శ్నిచిన ఎవ‌ర్నీ జ‌గ‌న్ వ‌దిలిపెట్ట‌లేదు. చంద్ర‌బాబు నుంచి.. ర‌ఘురామ కృష్ణంరాజు వ‌ర‌కు ఎవ్వ‌రూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క‌ పాలన నుంచి త‌ప్పించుకోలేక పోయారు. కేవ‌లం ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డం, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం చేశాడు. ఏపీలో చంద్ర‌బాబు హ‌యాంలో తీసుకొచ్చిన కంపెనీల‌ను త‌రిమేసిన జ‌గ‌న్‌.. క‌నీసం రోడ్ల‌పై ప్యాచ్ వ‌ర్కులు కూడా చేయించ‌లేక పోయారు. ఏపీ ప్ర‌జ‌లు జ‌గ‌న్ పాల‌న‌పై మండిప‌డుతున్నా.. వైసీపీ అనుకూల మీడియాలో, సోష‌ల్ మీడియాలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన   హామీలన్నీ నెర‌వేరుస్తున్నామంటూ ఢంకా మోగించారు. మ్యానిఫెస్టో విడుద‌ల స‌మ‌యంలో 99శాతం హామీలు నెర‌వేర్చామ‌ని జ‌గ‌న్ చెప్ప‌డంపై జనం విస్మయం  వ్య‌క్తం చేస్తున్నారు.

 ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చి ఎలాంటి భ‌యం లేకుండా  ప్ర‌జ‌ల మ‌ధ్య‌న ర్యాలీలు, స‌భ‌ల్లో పాల్గొంటుంటే ఆ ఆనంద‌మే వేరు అన్న‌ట్లుగా జ‌గ‌న్ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. ఇది విన్న ప్ర‌జ‌లు.. మ‌రి   ఇన్నాళ్లు ప‌ర‌దాల మాటున ఎందుకు తిరిగావ్ జ‌గ‌న‌న్నా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఇచ్చిన హామీల‌ను తుంగ‌లో తొక్కేసి.. చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగిన కాసింత అభివృద్ధినికూడా నిర్వీర్యం చేయ‌డం త‌ప్పితే జ‌గ‌న్ ఏపీ ప్ర‌జ‌ల‌కు కొత్త‌గా  చేసింది ఏమీలేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. క‌ళ్ల‌ముందు ఇన్ని వాస్త‌వాలు క‌నిపిస్తున్నా, వైసీపీ సోష‌ల్ మీడియా క్రియేటివిటీని చూసి ప్ర‌జ‌లు ముక్కున వేలేసుకుంటున్నారు. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ్యానిఫెస్టో విడుద‌ల స‌మ‌యంలో వైసీపీ సోష‌ల్ మీడియాలో ప‌లు వీడియోలు ప్ర‌త్య‌క్ష మ‌య్యాయి. ఈ వీడియోల్లో ఓ వృద్ధురాలు మ్యానిఫెస్టోలో కొత్త ప‌థ‌కాలు ఏంఏం ప్ర‌క‌టిస్తున్నారోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.. మ‌రొక వీడియోలో మ్యానిఫెస్టో ప్ర‌క‌టిస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కొంద‌రు మ‌హిళ‌లు ఏకంగా హార‌తి ఇచ్చేస్తున్నారు.. మ‌రో వీడియోలో కొంద‌రు గ్రామ‌స్తులు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ్యానిఫెస్టో చ‌దువుతుంటే ఉత్కంఠ‌భ‌రితంగా టీవీని వీక్షిస్తున్నారు.

ఒక‌ప‌క్క వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో జ‌గ‌న్ మ్యానిఫెస్టో ప్ర‌క‌టిస్తుంటే.. మ‌రోప‌క్క వైసీపీ సోష‌ల్ మీడియా ముందుగానే ప్లాన్ చేసిన వీడియోలు తెగ వైర‌ల్ అయ్యాయి. ఈ వీడియోల‌ను చూసిన నెటిజ‌న్లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న టీంకు పిచ్చి పీక్ స్టేజ్‌కు వెళ్లిందంటూ కామెంట్ల‌తో త‌మ ఆగ్ర‌హాన్ని వెలుబుచ్చారు. ఎన్నిక‌ల్లో వైసీపీకి ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని ఇప్ప‌టికే   స‌ర్వేల‌న్నీ తేల్చేశాయి. ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక పోతున్న జ‌గ‌న్.. ఎలాగైనా ప్ర‌జ‌ల‌ను మ‌యాచేసి మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని  అన్నిప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే గుల‌క‌రాయి డ్రామాను తెర‌పైకి తెచ్చిన‌ప్ప‌టికీ.. అది తుస్సుమంది. గ‌తంలో కోడి క‌త్తి డ్రామా, బాబాయ్ హ‌త్య‌కేసును చంద్ర‌బాబుపై నెట్ట‌డం వంటి విష‌యాల‌ను గుర్తు చేసుకున్న ప్ర‌జ‌లు గుల‌క‌రాయి డ్రామాను ఈడ్చిత‌న్నారు. అయినా  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందేందుకు త‌న ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగిస్తూనే ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే బాహుబ‌లి సినిమా లెవ‌ల్లో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా ముంద‌స్తుగా రూపొందించిన వీడియోల‌ను వైసీపీ సోష‌ల్ మీడియాలో ప్లాట్ ఫాంల‌లో ప్ర‌జ‌ల‌పైకి వ‌దిలారు. ఇలాంటి ట్రిక్ ల‌ను జ‌గ‌న్, ఆయ‌న బ్యాచ్ ఎన్ని ప్ర‌యోగించినా ప్ర‌జ‌లు మాత్రం  ఓటు ద్వారా ఏపీ నుంచి వైసీపీని త‌రిమికొట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం శనివారం (మే11) సాయంత్రంతో ముగుస్తుంది. సోమవారం (మే13)న ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని నెలల కిందటి వరకూ రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం వేరు. ఇప్పుడు వేరు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. నాలుగైదు నెలల కిందటి వరకూ రాష్ట్రంలో మరోసారి జగన్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు అన్న భావన గట్టిగానే వ్యక్తమయ్యేది. అయితే ఆ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం అయితే ఏపీలో ఎన్నికల వార్ వన్ సైడేనని సామాన్య జనం కూడా అంటున్నారు. తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వేవ్ ఉందని చెబుతున్నారు. నమ్ముతున్నారు.
కాగా, ఈ సిరీస్లో మూడో ఎపిసోడ్ శనివారం నాడు రిలీజ్ అయింది. మొదటి, రెండవ ఎపిసోడ్స్.లో మెరుపులా మెరిసిన డైమండ్ రాణి, ఈ ఎపిసోడ్‌లో పూర్తి స్థాయిలో
బూతుల ఫ్యాక్టరీ, గుట్కా బస్తా అని గిట్టనివారు పిలుచుకునే కొడాలి నానికి ఇప్పుడు కొత్త పిచ్చి పట్టింది. కొడాలి నాని నోరు తెరిస్తే గుట్కా కంపు ముందు వస్తుందో, బూతుమాట ముందు వస్తుందో నిజానికి ఆయనకి కూడా తెలియదు.
సింహం సింగిల్ గానే వస్తుంది. ఎంత మంది కలిసినా వా వెంట్రుక కూడా పీకలేరు. వైనాట్ 175, అక్క చెల్లెమ్మలు, అవ్వా తాతలకు సంకేమం సొమ్ములు క్రమం తప్పకుండా బటన్ నొక్కి పంచాను. వాళ్లంతా నాకే ఓటేస్తారు. ఇవీ జగన్ నిన్నమొన్నటి దాకా గంభీరంగా చెప్పిన మాటలు. మరి ఆ ధైర్యం, స్థైర్యం ఏమైపోయాయో.. ఇప్పుడు బేలగా, దీనంగా మాట్లాడుతున్నారు.
వల్లభనేని వంశీ.. ఇటీవలి కాలంలో ప్రజలలో బాగా నానుతున్న పేరు. అదేదో ఆయన గొప్ప పనులు చేసేశారని కానీ, సమాజ సేవలో మునిగి తేలుతున్నరాన్న ప్రశంసలతో కానీ కాదు. అడ్డగోలు రాజకీయం, తిన్న ఇంటి వాసాలనే లెక్కపెట్టే నైజంపై వెల్లువెత్తుతున్న విమర్శల కాలంగా ఇటీవలి కాలంలో ఆయన పేరు ప్రజలలో బాగా చర్చకు వచ్చింది.
అది అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో జడ్జి రామకృష్ణ నివాసం. సమయం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు అవుతోంది. అకస్మాత్తుగా కొంతమంది వ్యక్తులు రామకృష్ణ ఇంటి మీద దాడి చేశారు. వాళ్ళ చేతిలో వేటకొడవళ్ళు వున్నాయి.
ఛత్తీస్ గడ్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు నేలకొరిగారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భారీగా ఆయుధాలను, విప్లవసాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
జగన్ ఎలా తయారయ్యాడంటే, తన విషయంలో ఏది జరిగినా దాని వెనుక వున్నది చంద్రబాబే. జగన్‌కి నరాల వీక్నెస్ వచ్చినా దానికి కారణం చంద్రబాబే. ఎంచక్కా బాబాయ్‌ని పైకి పంపేసి, ఆ నేరాన్ని చంద్రబాబు నెత్తిన వేశాడు.
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ సరళి ఎలా ఉండబోతోందో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తీరు తేల్చి చెప్పేసింది. ఏపీలో ప్రభుత్వోద్యోగులు, టీచర్లు మున్నెన్నడూ ఎరుగని విధంగా ఓ విధమైన కసితో పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్న తీరు ప్రభుత్వంపై వారి వ్యతిరేకత, ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసింది.
ఎన్నికల పండగ వచ్చింది.. హైదరాబాద్ ఖాళీ అవుతుంది..! ఎప్పుడూ పండగల సమయంలో ఖాళీ అయ్యే హైదరాబాద్ ఈసారి ఎన్నికల నేప‌థ్యంలో ఖాళీ అవుతోంది. డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ బస్సు టికెట్ల ధరలు ఆకాశాన్నంటేస్తున్నాయి. దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండగలకు పెంచే దానికంటే అధికంగానే ఉన్నాయి టికెట్ ధరలు. ఒక్కో టికెట్ రెండు వేల రూపాయ‌ల నుంచి మూడు వేల రూపాయ‌ల ధ‌ర వ‌సూలు చేస్తున్నారు.
ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ వాస్తవ్యులు  భారీ ఎత్తున సొంత రాష్ట్రం ఏపీకి తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని స్వగ్రామాలకు, సొంత పట్టణాలకు తరలివస్తున్న వారితో హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సులు క్రిక్కిరిసి ఉంటున్నాయి
అమ్మా న్యాయం చేయండి.. ఐదేళ్లుగా అక్కాచెల్లెళ్లు న్యాయం కోసం పోరాడుతున్నారు.. మ‌న తెలుగు సాంప్ర‌దాయం ప్ర‌కారం ఆడ బిడ్డ‌లు పుట్టింటికి వ‌స్తే చీర‌సారె పెట్టి పంపిస్తారు.. మీ ఆడ బిడ్డ‌లు పుట్టింటికి వ‌చ్చి చీర‌సారె అడ‌గ‌డం లేదు.. కొంగు చాపి న్యాయం అడుగుతున్నారు.
జగన్ బటన్ నొక్కుడు బండారం సందేహాలకు అతీతంగా బట్టబయలైపోయింది. ఎన్నికల లబ్ధి కోసమే ఆయన బటన్ నొక్కుడు వ్యవహారం అంతా సాగిందని సామాన్యులకు కూడా అర్ధమైపోయింది. ప్రభుత్వ ఖర్చుతో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే వ్యూహంతోనే ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకూ బటన్ నొక్కుడు సభలు నిర్వహించారని తేటతెల్లమైపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.