నాటుసారా డెత్స్‌ డైవ‌ర్ష‌న్‌కే పెగాస‌స్‌?.. వైసీపీ ఖ‌త‌ర్నాక్‌ పాలిటిక్స్‌!

Publish Date:Mar 21, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్’లో దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏక పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తోందా? అధికార పార్టీ, ఆడింది ఆట, పాడింది పాట అన్నట్లుగా, శాసనసభ కార్యకలాపాలు సాగుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అధికార వైసీపీ సభ్యులు సభలో వ్యవహరిస్తున్న తీరు ప్రజస్వామ్య విలువలను పాతరేసే విధంగా ఉందని, ఎవరో కాదు, ఆ పార్టీ నాయకులే, సభ బయట వ్యక్తిగత సంభాషణల్లో ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. గత వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,  సభలో కన్నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే, అంతకు మించి సభ జరుగుతున్న తీరుకు వేరే తిప్పని అవసరం లేదు. నిజానికి, చంద్రాబాబు నాయుడు సభలో తమకు జరిగిన అవమానానికి కలత చెంది, కన్నీరు పెట్టుకున్న తర్వాత అయినా అధికార పార్టీ సభ్యుల ప్రవర్తనలో లేదా ప్రభుత్వం సభను నిర్వహిస్తున్న తీరులో గానీ, ఏమైనా మార్పు వచ్చిందా, అంటే అదీ లేదు. సభలో ప్రతిపక్షమే ఉండకూడదు, అనే విధంగా, వరసగా గత ఐదు రోజులుగా, ప్రతిపక్ష తెల్సుసు దేశం సభ్యులను, ఏ రోజుకు ఆ రోజు సభ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతోంది. 

రాష్టంలో కల్తీ సార తగి 18 మంది చనిపోతే, దాని పై సభలో  చర్చజరగ కుండా చేయడమే కాకుండా,అవన్నీ  సహజ మరణాలని బుకాయించే ప్రయత్నం చేయడం, ప్రజస్వామ్యాన్ని పరిహరించడమే అవుతుందని, అంటున్నారు. నిజానికి కల్తీ సారా, మద్యం కారణంగా రాష్ట్రంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తెలుదు దేశం, ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతే కాదు, నాటుసారా మరణాలపై నుంచి దృష్టి మళ్లించేందుకే, అసెంబ్లీలో పెగాసెస్ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 

అదలా ఉంటే,వరుసగా ఐదో రోజూ.. అసెంబ్లీ నుంచి తమను సస్పెండ్ చేయటం దుర్మార్గమని తెదేపా నేతలు మండిపడ్డారు. నాటుసారా మరణాలపై నుంచి దృష్టి మళ్లించేందుకే.. ఏపీ అసెంబ్లీలో పెగాసెస్ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారని విమర్శించారు. నాటుసారా మరణాల పై నుంచి దృష్టి మళ్లించేందుకే.. ఏపీ అసెంబ్లీలో పెగాసెస్ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారని తెదేపా ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. వరుసగా అయిదో రోజూ.. అసెంబ్లీ నుంచి తమను సస్పెండ్ చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. పార్లమెంటులో పెగాసస్‌పై చర్చ వద్దన్న వైకాపా.. అసెంబ్లీలో మాత్రం చర్చకు పట్టుపడుతోందని ఎద్దేవా చేశారు. 

అధికారం ఉంది కనుక..పెగాసస్‌పై దర్యాపు చేసి నిజానిజాలు తేల్చి ప్రజల ముందుంచాలని సవాల్ చేశారు. చంద్రబాబు మీద బురద జల్లడానికే.. మమత బెనర్జీతో ఫేక్ మాటలు చెప్పించారని ఆరోపించారు. మద్యం, సారా కారణంగా రాష్ట్రంలో వెయ్యిమందికి పైగా చనిపోయారని నేతలు ఆరోపించారు. తాడేపల్లికి వచ్చే మద్యం ఆదాయం తగ్గుతుందనే.. పెగాసెస్ పై అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు.

దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేనటువంటి బ్రాండ్స్ ఏపీలో ఉన్నాయి. మందు కాదు అది విషని, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆరోపించారు. రాష్టంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి పెగాసస్ అంశాన్ని శాసనసభలోకి తీసుకురావడం అత్యంత హేయమైన చర్య. దీనిని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. నిజం. రాష్ట్రంలో  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మద్యం పాలసీలో వచ్చిన మార్పులు, ప్రవేశ పెట్టిన దేశంలో ఎక్కడా లేని మద్యం  బ్రాండ్స్’ వలన సామాన్య ప్రజలు అనేఅక మంది అనారోగ్యం పాలయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు.

By
en-us Political News

  
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.