పెద్దిరెడ్డి జమిలి జపం.. ఎందుకంటే?

Publish Date:Jul 1, 2025

Advertisement

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ గౌరవం ఇచ్చే ఇచ్చే అతికొద్ది మంది నాయకుల్లో ఒకరు. కొంత కాలంగా పొలిటికల్ స్టెట్‌మెంట్లకు దూరంగా ఉంటున్నారు పెద్దిరెడ్డి. మాజీ సీఎం జగన్ తరహాలోనే ఆయన జమిలి మంత్రి పఠిస్తున్నారు. 2027 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు వస్తాయని,  వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.  స్వయంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషే ఆ విషయం చెప్పారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
పెద్దిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పైగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారంటూ పెద్దిరెడ్డి చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. జగన్ తరహాలో ఆయన కూడా తొలిసారి జమిలిమంత్రం పఠించడటంతో రాజకీయ వర్గాల్లో జమిలిపై చర్చ మొదలైంది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే.. సార్వత్రిక ఎన్నికలు పూర్తైన కొన్ని రోజుల తర్వాత నుంచి రాష్ట్రంలో జమిలి ఎన్నికల ప్రచారం జోరందుకుంది.   2027లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని వైసీపీ నేతలు ఊదరగొడుతున్నారు. పార్టీలో పెద్దాయనగా గుర్తింపు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడాఇప్పుడు  అదే చెబుతుండటం హాట్‌టాపిక్‌గా మారింది.

అసలు పెద్దిరెడ్డి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న చర్చ ఊపందుకుంది. పెద్దిరెడ్డి ఈ సమయంలో జమిలి జపం చేయడానికి ప్రధానంగా  రెండు  కారణాలు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. 

ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడం వైసీపీని సహజంగానే నిరుత్సాహానికి గురిచేసింది. రాష్ట్రంలో కూటమి తిరుగులేని మెజార్టీ ఉండడంతో వలసలు సర్వ సాధారణమయ్యాయి. క్షేత్రస్థాయిలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు, క్యాడర్‌లో నైతిక స్థైర్యం నింపేందుకే స్వయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి కామెంట్లు చేసి ఉండొచ్చన్న మాట విన్పిస్తోంది. 

రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో విఫలమైందని ఆరోపిస్తోంది వైసీపీ. గత వైసీపీ పాలనలో ప్రతి ఒక్కరికీ తాము ఎన్నో సంక్షేమ పథకాలు అందించగా.. ఇప్పుడు వాటిలో కొన్నింటిని కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని జగన్ పదేపదే ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం కోసమే ఈ మైండ్ గేమ్ అడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పెద్దిరెడ్డి కావచ్చు.. లేదంటే మరో వైసీపీ నేత కావచ్చు.. ఎవరి కామెంట్లనైనా పక్కన పెడితే జమిలీ ఎన్నికలు 2027లో వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే అదంత సులువేం కాదన్న మాట విన్పిస్తోంది. ఇప్పటికే జనగణనకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. జనగణనలోనే కులగణన చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది.

జనగణన, కులగణన పూర్తి చేసి, పార్లమెంటులో వాటిని ఆమోదించే ప్రక్రియ పూర్తయ్యే సరికి చాలా సమయం పడుతుంది. పైగా నియోజకవర్గాల పునర్విభజన అంశం ఎలాగూ ఉంది. ఆ ప్రకారం చూస్తే ఏదైనా అద్భుతం జరిగి చకచకా పరిణామాలు జరిగితే తప్ప 2029 వరకు జమిలీ వచ్చే అవకాశామే లేదన్న వాదన వినిపిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అదే చెబుతున్నారు. ఆ క్రమంలో  వైసీపీ కార్యకర్తలు, నేతలను ఇతర పార్టీల వైపు వెళ్లకుండా నిలువరించడం, ప్రత్యర్థి పార్టీలపై మైండ్ గేమ్ ఆడడం లక్ష్యంగా వైసీపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్న వాదన బలంగా విన్పిస్తోంది.

By
en-us Political News

  
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.