ఎంతకాలం బతికినం అనేది కాదు.. ఎట్లా బతికినం అనేది ముఖ్యం..! : కేటీఆర్

Publish Date:Aug 10, 2026

Advertisement

 

పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో కంటతడి పెట్టిన హరీశ్ రావు..!

తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా నర్సంపేట ప్రాంతాభివృద్ధిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. నల్లబెల్లి వేదికగా ఏర్పాటు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో బీఆర్ఎస్ అగ్రనేతలు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన సెంటిమెంట్స్ అక్కడున్న వారందరినీ తీవ్ర భావోద్వేగానికి గురిచేసాయి. ప్రజల కోసం నిరంతరం తపించే గొప్ప నాయకుడిని కోల్పోవడం నర్సంపేట నియోజకవర్గానికే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

 

సంతాప సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్ రెడ్డి కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం ఆలోచించే గొప్ప అభ్యుదయవాది అని కొనియాడారు. రాజకీయాధికారం ఉన్నా లేకపోయినా నర్సంపేట ప్రజల సంక్షేమం, ప్రాంతాభివృద్ధి కోసమే ఆయన నిరంతరం పరితపించారని గుర్తు చేసుకున్నారు. ఏ నర్సంపేట మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి తన ప్రాణప్రదంగా తాపత్రపడ్డారో, వచ్చే రెండేళ్లలో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కాగానే ఆ మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరును ఖచ్చితంగా పెట్టి తీరుతామని కేటీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారు. ఆకాశంలో సూర్యచంద్రులు ఉన్నంతకాలం నర్సంపేట చరిత్ర పుటల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెరగని ముద్రగా నిలిచిపోతుందన్నారు.

 

 

రాజకీయాలకతీతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కేటీఆర్ భరోసానిచ్చారు. కష్టకాలంలో ఆయన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యతను పార్టీ స్వయంగా తీసుకుంటుందని చెప్పారు. భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా బిఆర్ఎస్ ముందుంటుందని స్పష్టం చేశారు. 

నాయకుడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నర్సంపేట ప్రజలకు, కార్యకర్తలకు ధైర్యం చెబుతూ, పెద్ది ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎంతకాలం బతికినం అనేది కాదు.. ఎట్లా బతికినం అనేది ముఖ్యమని కేటీఆర్ తెలిపారు. దానికి నిదర్శనం పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు తరలివచ్చిన జనం.. లక్షకు పైగా మంది 12 గంటల పాటు వర్షం పడుతున్నా ఎక్కడికి వెళ్లకుండా అంతిమయాత్రలో పాల్గొన్నారని కేటీఆర్ తెలిపారు.

 

 

మరోవైపు మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతి తెలంగాణ ప్రజా ఉద్యమంలోనూ పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర చాలా కీలకమైనదని, అంతటి పెద్ద నాయకుడైనా ఎంతో సాధారణ జీవితం గడిపిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఇటీవల పెద్ధితో కలిసి తాను పాల్గొన్న పురాతన దేవాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలోని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ హరీశ్ రావు కంటతడి పెట్టారు. ఆనాటి వేడుకనే ఆయనతో తనకు చివరి కలయిక అవుతుందని అస్సలు ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆయనపై ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, భయపెట్టినా, అనేక రకాల ప్రలోభపెట్టినా ఏనాడూ తన సిద్ధాంతాల నుంచి తలొగ్గని ధీశాలి పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు.

ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైన సమయంలో ప్రాణాలతో బ్రతికించడం కోసం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కాదని హరీశ్ రావు వివరించారు. ఎన్ని రకాల వైద్య సదుపాయాలు అందించినా, దేవుడి నిర్ణయం ముందు మనం ఏమీ చేయలేకపోయామని ఆవేదన చెందారు. సుదర్శన్ రెడ్డి లేని లోటు తీర్చలేనిదని, అయితే ఆయన కన్న కలలను నెరవేర్చేందుకు నర్సంపేట ప్రజలతో కలిసి బిఆర్ఎస్ శ్రేణులు ముందుకు సాగుతాయని హామీ ఇచ్చారు. 

పెద్ది సుదర్శన్ రెడ్డి చూపిన మార్గం, ఆయన చేసిన సేవలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటాయని, ఆయన జ్ఞాపకాలు నర్సంపేట గడ్డపై ఎప్పటికీ సజీవంగా నిలిచిపోతాయని నేతలు ముక్తకంఠంతో చాటిచెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డి  ఉద్యమ పోరాటాలు, ప్రజాసేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్‌లోని అమర వీరుల స్తూపం వద్ద పోలీసులతో జరిగిన ఘర్షణలో నాకు దెబ్బ తగిలినప్పుడు.. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లిన పెద్ది సుదర్శన్ రెడ్డిని, అదే ఆసుపత్రిలో చివరి చూపు చూస్తానని కలలోనైనా ఊహించలేదని మాజీ మంత్రి భావోద్వేగానికి గురయ్యారు.


Peddi Sudarshan Reddy, KTR speech, Harish Rao emotional, Narsampet medical college, BRS party news, Warangal condolence meeting

By
en-us Political News

  
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీదేవతలను ప్రార్థిస్తూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం
శరీరం మంట తట్టుకోలేక నీటిలోనే రోజులకు రోజులు ఉంటున్న ముర్షిదాబాద్‌ బాలుడి వింత పరిస్థితి స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ఒకప్పుడు మావోయిస్టు లకు కంచుకోటగా, సేఫ్‌ షెల్టర్‌ జోన్‌గా ఉన్న కర్రెగు ట్టలు ఇప్పుడు తెలంగాణ పోలీసుల పటిష్ట భద్రతలోకి వచ్చాయి.
మద్యం మత్తులో ఇంజెక్షన్..! విద్యార్థిని ప్రాణాలు తీసిన ఆర్ఎంపీ..!
మద్యం మత్తులో కారు డ్రైవర్ భీభత్సం.. ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి..!
జేపీఎస్సీ పేపర్ లీక్ దుమారం.. విద్యార్థులపై పోలీసుల వాటర్ క్యాన్స్ ప్రయోగం..!
ళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన ఈ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన పనులలో ఇప్పుడు కదలిక రావడమే కాకుండా వేగం పుంజుకున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయవాడ, విశాఖ రైల్వే ప్రాజెక్టులు రెండూ కలిపి 21వేల 616 కోట్ల భారీ అంచనా వ్యయంతో, 84.63 కిలోమీటర్ల పొడవైన మెట్రో నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది.
మీ స్మార్ట్‌ఫోన్ మరియు డిజిటల్ డేటాను హాకర్లు, డేటా చోరీ నుండి ఎలా రక్షించుకోవచ్చో తెలుసుకోండి. నార్టన్, 1పాస్‌వర్డ్, ప్రొటాన్ మెయిల్ మరియు అథెంటికేటర్ యాప్‌లతో అత్యుత్తమ సైబర్ సెక్యూరిటీ గైడ్.
USB పెన్ డ్రైవ్‌ల వాడకం ఎందుకు తగ్గింది? క్లౌడ్ స్టోరేజ్, స్మార్ట్‌ఫోన్‌లు, వేగవంతమైన SSDలు డేటా నిల్వ ప్రపంచాన్ని ఎలా మార్చేశాయో, పెన్ డ్రైవ్‌ల భవిష్యత్తు ఏమిటో ఈ వెబ్ స్టోరీ ద్వారా తెలుసుకోండి.
రన్నింగ్ అంటే విసుగు చెందే వారికి గూగుల్ జెమిని AI మరియు గార్మిన్ స్మార్ట్‌వాచ్ ఎలా ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయో ఈ కథనంలో తెలుసుకోండి. 14 కిమీ సిటీ2సర్ఫ్ పరుగు కోసం జెమిని అందించిన 3 దశల వర్కౌట్ ప్లాన్, హెల్త్ టిప్స్ మరియు ఫిట్‌నెస్ సీక్రెట్స్ మీ కోసం!
నల్సార్ క్యాంపస్‌లోని  విద్యార్థుల  మాత్రం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ను స్నాతకోత్సవానికి ఆహ్వానించడానికి వీల్లేదంటూ వ్యతిరేకిండం కలకలం రేపింది. దాదాపు  వర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్‌ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించవద్దంటూ దాదాపు 450 మంది విద్యార్థులు సంతకాలు చేసిన లేఖను వర్సిటీ వీసీకి సమర్పించారు. 
ఆగస్టు 10 నాటి పసిడి మరియు వెండి రిటైల్ ధరల పూర్తి సమాచారం. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో 24K, 22K బంగారం మరియు కిలో వెండి తాజా రేట్లు, MCX మార్కెట్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్ లైవ్ అప్‌డేట్స్: సెన్సెక్స్, నిఫ్టీ పతనం, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్ల కదలికలు, ఐటీ రంగం రికవరీ మరియు ఎస్‌బీఐ క్యూ1 ఫలితాల పూర్తి విశ్లేషణ. గ్లోబల్ మార్కెట్ సంకేతాలు, గిఫ్ట్ నిఫ్టీ స్థాయిలు మరియు ఈ వారం ఇన్వెస్టర్లు పాటించాల్సిన కీలక వ్యూహాలను క్షుణ్ణంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.