పథకాలకు నిధుల కొరత లేకుండా పయ్యావుల కేటాయింపులు
Publish Date:Feb 28, 2025
Advertisement
వివిధ శాఖలకు, పధకాలకు పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేశారు. రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టుల కోసం 506 కోట్ల రూపాయలు కేటాయించిన ఆయన, ఆర్టీజీఎస్ కు 101 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే చేనేత, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం 450 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే వివిధ పధకాల కోసం పయ్యవుల కేశవ్ తన పద్దులో చేసిన కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు... రూ.27,518 కోట్లు అన్నదాత సుఖీభవ.. రూ.6,300 కోట్లు ఐటీ, ఎలక్ట్రానిక్స్ రాయితీలు.. రూ.300 కోట్లు ఆదరణ పథకం.. రూ.1000 కోట్లు మనబడి పథకం.. రూ.3,486 కోట్లు తల్లికి వందనం.. రూ.9,407 కోట్లు అమరావతి నిర్మాణం.. రూ.6 వేల కోట్లు దీపం 2.0 పథకం.. రూ.2,601 కోట్లు రోడ్ల నిర్మాణం, మరమ్మతులు.. రూ.4,220 కోట్లు బాల సంజీవని పథకం.. రూ.1,163 కోట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్పులు.. రూ.3,377 కోట్లు పురపాలక శాఖ.. రూ.13,862 కోట్లు స్వచ్ఛ ఆంధ్ర.. రూ.820 కోట్లు ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్.. రూ.400 కోట్లు
http://www.teluguone.com/news/content/payyavula-budget-assure-no-funds-shortage-for-schemes-25-193574.html





