కాంగ్రెస్ కు పవార్ బిగ్ షాక్

Publish Date:Apr 15, 2023

Advertisement

ఓ వంక జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఏకం  చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే, ఆ పార్టీ  మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అలాగే జేడీయు అధినేత, బీహార్ ముఖ్యమత్రి నితీష్ కుమార్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్... ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్న సమయంలో ఎన్సీపీ అధినేత శరద పవార్  విపక్ష పార్టీలకు  ముఖ్య్మగా కాంగ్రెస్ పార్టీకి సర్ప్రైజ్ షాక్ ఇచ్చారు.  జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత గురించి ఖర్గే, రాహుల్ గాంధీతో చర్చించిన పవార్, 24 గంటలు తిరక్కుండానే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ 45 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. 

నిజానికి  ఇటీవల ఒకటి రెండు సందర్భాలలో శరద్ పవార్  పార్టీ ఎన్సీపీ విపక్షాల ఉమ్మడి నిర్ణయాలకు దూరంగా ఉంటోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే  అధికార బీజేపీ దగ్గరవుతున్న సంకేతాలు స్పష్ట మవుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా  అదానీ వ్యవహారంలో జేపీసీ కోసం విపక్ష పార్టీలన్నీ ముఖ్యంగా కాంగ్రెస్ అనుకూల విపక్షాలన్నీ పట్టు పట్టిన సందర్భంలో పవార్  అందుకు భిన్నమైన  స్టాండ్ తీసుకున్నారు. అలాగే రాహుల్ గాంధీ సావార్కర్ ను చులక చేస్తూ చేసిన వ్యాఖ్యల విషయంలోనూ  పవార్ రాహుల్ గాంధీని నోరు అదుపులో పెట్టుకునేలా కట్టడి చేయాలని సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేకు సూచించినట్లు వార్త లొచ్చాయి. మరోవంక  పవర్ బంధువు, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బీజేపీలో చేరుతున్నట్లు మహారాష్ట్ర మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరాఠా యోధుడు శరద్ పవార్ అడుగులు అటుగా పడుతున్నాయా అనే అనుమానాలకు బలం చేకూరుతోంది.

సరే  ఆ పరిణామాలకు ఎన్సీపీ తీసుకున్న తాజా నిర్ణయానికి ప్రత్యక్ష సంబంధం ఉన్న లేకున్నా  కర్ణాటక బరిలో ఎన్సీపీ  అది కుడా ఏకంగా 45 స్థానల్లో బరిలో దిగితే  ప్రభుత్వ వ్యతిరేక ఓటు మరింతగా చీలి  బీజేపీ లబ్ధి పొందుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, జేడియూ మధ్య  ముక్కోణపు పోటీ నెలకొంది. మరోవంక ఎంఐఎం కూడా పోటీకి రెడీ అవుతోంది. ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించారు.  అలాగే సిపిఎం కుడా పరిమితంగా నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించింది. అలాగే, భారత రాష్ట్ర సమితి ఇప్పటికి ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ పోటీ చేసే అవకాశాలను కొట్టివేయలేమని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.  

ఈ  తరుణంలో ఎన్సీపీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నామని చేసిన ప్రకటన సహజంగానే విపక్ష కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఇటీవలే జాతీయ హోదా కోల్పోవడంతో ఆ హోదా తిరిగి పొందేందుకు అనివార్య పరిస్థితుల్లో కర్ణాటక ఎన్నికల బరిలోకి దిగాల్సి వస్తోందని ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో మరాఠీ ప్రజలు ఎక్కువగా ఉన్న చోట ఎన్సీపీ పోటీ చేయాలని అనుకుంటోంది. మహారాష్ట్ర ఏకీకరణ్ సమితితో కలిసి ఎన్సీపీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అయితే చివరకు కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఎన్సీపీ పరిమిత స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించవచ్చని ఇందుకు సంబంధించిన బేరసారాల కోసమే పవార్  బాంబు పేల్చారని కొందరు భావిస్తున్నా.. ఈ దశలో అది అయ్యేపని కాదని అంటున్నారు.

అదీగాక  గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుకు ప్రయత్నించి అభాసు పాలైన నేపథ్యంలో పవార్ మరోమారు ఆలాంటి తప్పు చేయరని, అంటున్నారు. అయితే   కారాణాలు ఏవైనా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎన్సీపీ ఎంట్రీ ఇవ్వడం  కాంగ్రెస్ కు బిగ్ షాక్ అనడంలో సందేహం లేదు.  జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతకు కూడా  కర్ణాటక పరిణామాలు లిట్మస్ టెస్ట్ గా నిలుస్థాయని భావిస్తున్న తరుణంలో ఎన్సీపీ పోటీ నిర్ణయం జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతకు భంగమేనన్న అభిప్రాయం వ్యక్త మౌతోంది. 

By
en-us Political News

  
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.