బలప్రదర్శనకు ససేమిరా.. బాలినేనికి జనసేనాని ఝలక్!

Publish Date:Sep 26, 2024

Advertisement

మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని రాజకీయ అడుగులు తడబడుతున్నాయి. ఆయన ఒకటి తలిస్తే మరోటి జరుగుతోంది. వైసీపీలో  ఓ మూడేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన బాలినేని.. అప్పట్లో జగన్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన సమయంలో  మంత్రి పదవి కోల్పోయారు. అప్పటి నుంచీ ఆయన జగన్ తో టామ్ అండ్ జెర్రీ ఆట ఆడుతూ వస్తున్నారు. అలకలు, అసంతృప్తులతో జగన్ కు చెవిలో జోరీగలా, చెప్పులో రాయిలా మారారు.

అయితే జగన్ అధికారం కోల్పోయే వరకూ వైసీపీతో, జగన్ తో తన బంధం తెగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఎప్పుడూ కూడా ఆయన తెగే వరకూ లాగలేదు. జగన్ నుంచి చిన్న పాటి పిలుపుకు, బుజ్జగింపులకు మెత్తబడిపోయారు. అయితే జగన్ అధికారం కోల్పోయాకా.. ఇంకా ఎందుకు అనుకు న్నారేమో వైసీపీకి రాజీనామా చేసేసి జనసేన గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. అయితే ఒంగోలులో తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా కూడా జనసేనాని బాలినేని చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో ఆయన గురువారం (సెప్టెంబర్26)న జనసేన తీర్ధం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారు. జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో అట్టహాసంగా, మందీ మార్బలంతో పెద్ద ఎత్తున బలప్రదర్శనతో ఆయన జనసేన తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారు. అయితే ఇక్కడే పవన్ కల్యాణ్ ఆయనకు ఊహించని ఝలక్ ఇచ్చారు.

బాలినేని బలప్రదర్శనకు ఆయన అంగీకరించలేదు. మంది మార్బలంతో, అనుచరగణంలో జనసేనలో చేరాలన్న బాలినేని ఆశలను పవన్ కల్యాణ్ మొగ్గలోనే తుంచేశారు. బాలినేని చేరిక సందర్భంగా ర్యాలీకి కూడా జనసేన అధిష్ఠానం అనుమతించలేదు. దీంతో తాను జనసేనలో చేరేది లేదంటూ అలగడానికి ప్రయత్నించినా.. జనసేన అధినేత స్పందించలేదు.

దీంతో గత్యంతరం లేక ఒంటరిగానే అంటే ఒక్కడుగానే పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయారు బాలినేని.  చేరాలనుకుంటే ఒక్కడివే మంగళగిరి వచ్చి జనసేన కండువా కప్పుకో.. అంతే కానీ ఒంగోలులో సభ, భారీ ర్యాలీ అంటే కుదరదని జనసేన అధినేత కుండబద్దలు కొట్టినట్లు బాలినేనికి చెప్పేశారని తెలుస్తోంది.  

By
en-us Political News

  
ఉద్యోగాల ఆశ చూపించి విదేశీ మహిళలను భారత్‌కు రప్పించడం.. ఆపై వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడంతో మాదాపూర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
సీఎం రేవంత్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ.. 152 మీటర్ల ఎత్తుపై ముందడుగు.!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
తెలంగాణలో రూ.96 కోట్ల ప్రభుత్వ నిధులకు గండి.!
ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసి బస్సులో చిన్నపాటి చిల్లర గొడవ కాస్తా ఊహించని సంఘటనకు దారితీసింది.
గంటకు 140 కి.మీ వేగంతో పెనుగాలులు..అప్రమత్తమైన యంత్రాంగం.!
ఒకవైపు ధరల మంట.. మరోవైపు కృత్రిమ కొరతలు..!
హైదరాబాద్ మహానగరంలో మరోసారి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.