వారాహిలో బందరు కు జనసేనాని

Publish Date:Mar 9, 2023

Advertisement

జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఈ నెల 14న మచిలీపట్నం వేదికగా జరగనుంది. ఇందుకు సన్నాహాలు, ఏర్పాట్లూ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. బందర్ సభను జనసేన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గత ఏడాది   గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఆ పార్టీ ఆవిర్భావ సభ కు స్థలం ఇవ్వడమే నేరంగా భావించిన అధికార పార్టీ ఇప్పటంలో జనసేన సభకు ఇచ్చిన వారి గృహాలను రోడ్డు విస్తరణ  పేరుతో కూల్చేవేతలకు పాల్పడటం,   జనసేనానికి సామాజిక వర్గానికే చెందిన మాజీ మంత్రి పేర్ని నాని వ్యూహం ప్రకారం జనసేనానిపై విమర్శలు గుప్పించడం తో జనసేనాని ఈ సారి పార్టీ ఆవిర్భావ సభ ను బందర్ వేదికగా నిర్వహించి అన్ని విమర్శలకూ దీటుగా బదులివ్వాలని నిర్ణయానికి వచ్చారు.  

అయితే  సభా వేదికపై  నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారు.. ఎవరిని టార్గెట్ చేస్తారన్న చర్చ మీడియాలో విస్తృతంగా సాగుతోంది.  ఈ నెల 14న బందర్ వేదికగా జరగనున్న జనసేన ఆవిర్భావ సభలో అధికార పార్టీ నేతలు, ముఖ్యంగా పేర్నినాని తదితరుల విమర్శలకు దీటుగా బదులివ్వడమే కాకుండా.. వచ్చే ఎన్నికలలో పొత్తు విషయంలో కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక క్లారిటీ ఇస్తారని పరిశీలకులు అంటున్నారు.   సరైన సమయంలో సరైన వేదిక మీద నుంచి  తన మాటల తూటాలను ప్రత్యర్థులపై గురి చూసి  వదలడంలో పవన్ కల్యాణ్ ముందుంటారని ఆయన అభిమానులకే కాదు, రాజకీయ ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు.

ఈ నాలుగేళ్ల కాలంలో జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలోనూ వెనుకబడిందన్న భావన సర్వత్రా  నెలకొని ఉంది. ఇప్పటికే పలు వేదికల మీదనుంచి జనసేనాని కూడా ఇదే విషయాన్ని విస్పష్టంగా చెప్పారు. మరో సారి జగన్ ను అధికారంలోకి రానివ్వను, అందు కోసం విపక్ష ఓట్లు చీలకుండా చూస్తాను అని పవన్ కల్యాణ్ గతంలోనే చెప్పారు. అప్పటి  నుంచి ఆయన అడుగులు ఓట్లు చీలకుండా చూడటం దిశగానే సాగాయి. ఈ నేపథ్యంలోనే వచ్చేఅసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకుంటాయన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

పరిశీలకుల విశ్లేషణల ప్రకారంఇప్పటికే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన శ్రేణులకు కలిసే పని చేస్తున్నాయి. పొత్త వార్తలను ఇటు జనసేన కానీ, అటు తెలుగుదేశం కానీ ఖండించ లేదు.   ఇక బందర్ వేదికగా జరగనున్న జనసేన ఆవిర్భావ సభ కోసం పవన్ షెడ్యూల్ కూడా ఖరారైంది.  ఆ షెడ్యూల్ ప్రకారం పవన్ కల్యాన్ ఈ నెల 11న మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగే బీసీ సదస్సులో పాల్గొంటారు. అనంతరం 12వతేదీన కాపు ఉద్యమ నేత హరిరామజోగయ్య, అలాగే ఆ సమాజిక వర్గానికి చెందిన ఇతర నేతలతో భేటీ అవుతారు.

ఆ మరుసటి రోజు అంటే జనవరి 13న పవన్ కల్యాణ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్  నజీర్ తో భేటీ అవుతారు. ఇక బందర్ లో జరిగే జనసేన ఆవిర్భావ సభకు జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో రానున్నారు.  అవసరం ఉన్నా లేకున్నా సందర్భం ఉన్నా లేకున్నా మీడియా సమావేశం పెట్టి మరీ  పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే మాజీ మంత్రి పేర్ని నాని ఇలాకాలో జనసేన సభ జరుగుతుండడం, అలాగే పవన్ వారాహి వాహనంతో మచిలీపట్నంలో ప్రవేశించనుండడం తో జనసేన ఆవిర్భావ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

By
en-us Political News

  
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.