పిఠాపురం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన పవన్

Publish Date:Apr 2, 2024

Advertisement

రానున్న ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఉదయం స్థానిక ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం యు. కొత్తపల్లి మండలం పొన్నాడలో బషీర్ బీబీ దర్గాకు బయలుదేరారు. ఆ తర్వాత ఉప్పాడ కొత్తపల్లిలో మహిళలతో సమావేశం అవుతారు. కాగా, పిఠాపురంలో పవన్ నాలుగో రోజు పర్యటనలో బీజీగా గడుపుతున్నారు.
పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకోవడానికే ఇక్కడకు వచ్చా. నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో ఏదో ఒకచోట ఇల్లు తీసుకుని ఉంటా. నన్ను ఒక్కసారి గెలిపించమని భగవంతుడిని కోరితే పిఠాపురం పిలిచింది. మనం భారీ మెజార్టీతో గెలవబోతున్నామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. పిఠాపురం మండలం కుమారపురంలోని గోకులం గ్రాండ్‌ లో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వైద్యులు, న్యాయవాదులు, వివిధ వర్గాల ప్రముఖులు, వైసీపీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీల చైర్మన్లు, నాయకులు జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పవన్‌ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పిఠాపురం నియోజకవర్గంలోని అందరినీ వ్యక్తిగతంగా కలవాలన్న ఆశ తనకు ఉన్నప్పటికీ భద్రతాపరమైన కారణాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పవన్‌ తెలిపారు. ప్రత్యర్థుల పన్నాగాలు గమనిస్తూ మనమంతా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. భద్రతాపరమైన ప్రొటోకాల్‌ పాటిస్తూ రోజుకి 200 మందిని కలిసి వారితో ఫొటోలు తీసుకుంటానని తెలిపారు. శ్రీపాదశ్రీవల్లభుడు, పురుహూతికా అమ్మవారు, బషీర్‌ బీబీ (బంగారు పాప) దర్గా, ఆంధ్రా బాప్టిస్టు చర్చి సాక్షిగా ప్రజలందరికీ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తాను భగవంతుడినీ ఏదీ కావాలని కోరుకోనని, అయితే సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అవుతున్న సమయంలో నల్గొండకు చెం దిన అభిమాని వచ్చి ఒక్క హిట్‌ ఇవ్వు అన్నా అని అడిగాడు. అప్పుడు ఒక్క హిట్‌ ఇవ్వమని, భీమవరంలో ఓడిపోయిన తర్వాత గెలుపు ఇవ్వమని భగవంతుడిని కోరానని, ఆ మేరకు తనను పిఠాపురం పిలిచిందని చెప్పారు. నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో ఉండాలన్నదీ త్వరలో నిర్ణయించుకుంటాని, పురుహూతికా అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడే ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకుని ఉంటానన్నారు. పగిలే గాజు గ్లాసుకు పదును ఎక్కువన్నారు. అందరినీ ప్రత్యేకించి కలుస్తానని, ప్రతి ఒక్కరి సమస్యలనూ తెలుసుకుంటానని తెలిపారు.పవన్ నేడు పిఠాపురం పర్యటనను ముగించుకుని రేపు తెనాలి వెళ్తారు. 4న  నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. 9న ఉగాది సందర్భంగా పిఠాపురంలో నిర్వహించే వేడుకల్లో పాల్గొంటారు. 10న రాజోలు, 11న గన్నవరం, 12న రాజానగరం బహిరంగ సభల్లో పాల్గొంటారు. 

By
en-us Political News

  
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.