చంద్ర బాబును పరామర్శించిన పవన్ కళ్యాణ్

Publish Date:Nov 4, 2023

Advertisement

జైలు నుంచి విడుదలై హైదరాబాద్ చేరుకున్నమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును  ఇవ్వాళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆయనతో బాటు ఈ భేటీలో జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెళ్ల మనోహర్  కూడా ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేన కల్సి పోటీ చేస్తున్నాయి.ఈ  నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఇటీవలే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శనివారం ఉదయం చంద్రబాబు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళ్లి వైద్యులను కలిసి వచ్చారు. ఈ భేటీలో ఏపీలో ఉమ్మడిగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించినట్లు సమాచారం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై దాదాపు 50 రోజులకు పైగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. గత నెల 30న బెయిల్ 4 వారాల పాటు ఇంటర్మ్ బెయిల్ ను ఏపీ హై కోర్టు మంజూరు చేసింది. కంటి ఆపరేషన్ నిమిత్తం ఆయనకు బెయిల్ లభించింది. బెయిల్ తర్వాత ప్రత్యేక విమానంలో హైదారాబాద్‌ చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తో  పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత భేటీ అవ్వడం తో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలనే కీలక నిర్ణయం తీసుకుంది టీడీపీ. అదే సమయంలో బీజేపీతో కలిసి తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతోంది. బిజెపితో పొత్తు ఖరారు కావడంతో  తెలంగాణలో 9 స్థానాలకు జన సేన పోటీ చేస్తుంది. జనసేనాని బిజెపితో కల్సి ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు భేటి కావడం రెండు ఉభయ రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.  చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీసిన పవన్, కంటికి జరుగుతున్న చికిత్స గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.  రాజమహేంద్రవరం జైల్లో ములాఖత్ అనంతరం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం కావడం ఇదే తొలిసారి. దీంతో ఈ భేటీపై ఇరు పార్టీల శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో - జనసేన పార్టీ అధినేత పవన్ భేటీలో తెలంగాణ ఎన్నికలు సహా ఏపీలోని తాజా రాజకీయాలు ఈ భేటీలో చర్చించారు. త్వరలో తెలుగుదేశం-జనసేన పార్టీల ఉమ్మడి విస్తృత స్థాయీ సమావేశాల నిర్వహాణపై ప్రస్తావనకు వచ్చింది. సీఐడీ పెడుతున్న వరుస కేసులపైనా వీరిరువురు చర్చించినట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల లీడర్లు, కేడర్ ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాల పైనా చర్చించారు.

ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన మీద చంద్రబాబు-పవన్ చర్చించినట్లు తెలుస్తుంది. పది అంశాలతో మినీ ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలని తెలుగుదేశం - జనసేన భావిస్తోంది. కామన్ మినిమమ్ ప్రొగ్రాం రూపకల్పన మీద చర్చించారు. కరవు, ధరల పెరుగుదల, కరెంట్ ఛార్జీల పెంపు, మద్యం, ఇసుక కుంభకోణాల వంటి అంశాల్లో క్షేత్ర స్థాయి పోరాటాలు చేపట్టాలని తెలుగుదేశం - జనసేన భావిస్తోంది. పవన్ కల్యాణ్, లోకేశ్ రాజమహేంద్రవరంలోనే ఇటీవలి తెలుగుదేశం జనసేన రాజకీయ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. త్వరలో అమరావతిలో టీడీపీ-జనసేన మరొక విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది.
 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.