కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాను అరెస్ట్ చేసేందుకు అస్సాం పోలీసులు హైదరాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్యపై పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవల పవన్ ఖేరా, అస్సాం సీఎం భార్యకు మూడు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలను అపకీర్తికరంగా భావించిన అస్సాం ప్రభుత్వం ఆయనపై కేసులు నమోదు చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదవడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా అస్సాం పోలీసులు ముందుగా ఢిల్లీలోని పవన్ ఖేరా నివాసంలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన హైదరాబాద్‌లో ఉన్నారని సమాచారం అందడంతో ప్రత్యేక బృందం అక్కడికి చేరుకున్నట్లు తెలిసింది.
పవన్ ఖేరా భార్య కోట నీలిమ కూడా కాంగ్రెస్ నాయకురాలిగా కొనసాగుతున్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఈ చర్యలను రాజకీయ ప్రతీకారంగా అభివర్ణిస్తుండగా, అస్సాం ప్రభుత్వం మాత్రం ఇవి చట్టపరమైన చర్యలేనని స్పష్టం చేస్తోంది. కేసుకు సంబంధించిన తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pawan-khera-36-216860.html
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
అసెంబ్లీకి అతి సమీపంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి తొలుత బాంబు బెదరింపు వచ్చింది. దీనిపై ఆల్ ఇండియా రేడియో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బయటకు పంపించారు.
హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్‌గా కూడా ఎదుగుతుంది.
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది.
తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.