పవన్ ముక్కు సర్జరీకి...అపోలో బిల్ ఎంతంటే?

Publish Date:Apr 19, 2026

Advertisement

 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్  కల్యాణ్‌ సర్జరీకి అపోలో ఆస్పత్రిలో ఎంత బిల్ అయ్యింది? దాన్ని ఎవరు చెల్లించారు? ప్రభుత్వమా? లేక తన కోడలి ఆస్పత్రే కాబట్టి బిల్ లాంటివేవీ ఉండవా? అనే ఆసక్తికరమైన చర్చ ఒకటి నడుస్తోంది.  సాధారణంగా రాష్ట్ర మంత్రులు లేదా ముఖ్యమంత్రులు ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందితే, ఆ ఖర్చును ప్రభుత్వం భరించే అవకాశం ఉంటుంది. కానీ, పవన్ కల్యాణ్ ప్రభుత్వ ఖర్చు తన కోసం వాడకూడదు అనే సిద్ధాంతాన్ని పాటిస్తుంటారు. గతంలో కూడా ఆయన తన భద్రత లేదా వ్యక్తిగత ఖర్చుల కోసం సొంత నిధులనే వాడుకున్నారు.

డిప్యూటీ సీఎం ముక్కుకు జరిగిన సైనస్ సంబంధిత శస్త్రచికిత్స- డేకేర్ సర్జరీకిగానూ.. అపోలో వంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో.. సుమారు రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, ఈ బిల్లు ఎంత అనే విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం గానీ, జనసేన పార్టీ గానీ అధికారికంగా బయటపెట్టలేదు. ఇక అపోలో ఆసుపత్రికి పవన్ కల్యాణ్‌కి  ఉన్న సంబంధం ఏంటో చూస్తే.. పవన్ అన్నయ్య చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల, అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు. దానికి తోడు ఆమె కూడా ఇందులో భాగస్వామి. ఈ క్రమంలో అపోలో హాస్పిటల్ వారి సొంత కుటుంబానికి చెందినదిగా  భావించవచ్చు. 

హాస్పిటల్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం బిల్లు అనేది తప్పనిసరిగా జనరేట్ అవుతుంది. అయితే.. సొంత కుటుంబ సభ్యులకు లేదా అత్యంత సన్నిహితులకు ఆసుపత్రులు కొన్నిసార్లు డిస్కౌంట్ ఇవ్వడం లేదా కేవలం మెడిసిన్ ఖర్చులనే తీసుకోవడం వంటివి జరుగుతుంటాయి. ఇక పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం ప్రకారం, ఆయన ఉచితంగా చికిత్స పొందేందుకు ఇష్టపడరని, తన బిల్లును తానే చెల్లించుకునే అవకాశమే ఎక్కువగా ఉందని అంటారు.. ఫైనల్ గా ఈ బిల్లు ఎవరు కట్టారు అనే దానిపై అధికారిక ప్రకటన లేకపోయినా, పవన్ కల్యాణ్ ప్రభుత్వ సొమ్మును తన వ్యక్తిగత చికిత్సకు వాడే రకం కాదని ఆయన గత ప్రవర్తనను బట్టి చెప్పవచ్చు. అది ఆయన కోడలి హాస్పిటల్ కాబట్టి, కుటుంబ సభ్యుల మధ్య ఉండే వెసులుబాటు ఉండవచ్చు, కానీ రికార్డుల ప్రకారం బిల్లు ప్రక్రియ మాత్రం జరిగి ఉంటుందని అంచనా.

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్పందించింది.
దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగిరి శాంతికి సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని బండి సంజయ్ మండిపడ్డారు.
తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రంతో ముగిసింది.
రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వ్యవహారం మరో మలుపు తిరిగింది.
చాయ్ అంటే ప్రాణం పెట్టే నగరం హైదరాబాద్. ఉదయం కప్పు నుంచి అర్ధరాత్రి స్టాల్ వరకూ చాయ్ లేకుండా రోజే కదలదు.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వద్దు జగ్గారెడ్డి సంచలన పోస్ట్
ఇరాన్‌పై అగ్రదేశం అమెరికాతో కలిసి దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెనత్యాహూ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారంట
ఒక మత చిహ్నానికి ప్రాధాన్యతనిచ్చి, మరో మత సంప్రదాయాలను కించపరచడం సెలెక్టివ్ టార్గెటింగ్ అని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా లెన్స్ ‌కార్ట్ పట్ల వ్యతిరేకత పెచ్చరిల్లడంతో.. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే సూచనలు కనిపించడంతో.. సంస్థ సీఈఓ పేయుష్ బన్సల్ రంగంలోకి దిగారు.
తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
ఒకటి.. హిజాబ్, టర్బన్ అనుమతి.. అంటే నల్లరంగు హిజాబ్, నల్ల టర్బన్ ధరించవచ్చు. హిజాబ్ ఛాతీ వరకు కవరేజ్ ఉండాలి, కంపెనీ లోగో కనిపించేలా ఉండాలి. అయితే బుర్ఖా మాత్రం స్టోర్లో అనుమతించబడదని గైడ్లో ఉంది. రెండు..బొట్టు, తిలకం చేతితాడుపై నిషేధం.. ఆ డాక్యమెంట్ లో మత చిహ్నం అయిన తిలకం, బింది, స్టిక్కర్ లకు అనుమతి లేదని స్పష్టంగా ఉంది. అలాగే మతపరంగా చేతికి కట్టుకుని తాడు కూడా నిషేధం అని విస్పష్టంగా ఉంది.
ఢిల్లీ హత్యాచార నిందితుడు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసులే నోరెళ్ల పెడుతున్నారు
ఒంటిమిట్ట అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.