బీజేపీది మత రాజకీయమన్న పవన్! తెగతెంపులు ఖాయమేనా? 

Publish Date:Jan 22, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. త్వరలో తిరుపతి లోక్ సభకు జరగనున్న ఉప ఎన్నికలో ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. తిరుపతిలో పోటీ చేయాలని జనసేన భావిస్తుండగా.. తామే పోటీ చేస్తామని ప్రకటిస్తున్నారు ఏపీ కమలం నేతలు. దీంతో ఇరు పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బీజేపీ.. ఇప్పుడు మాట తప్పుతుందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతల తీరుపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కుడా అసహనంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది.

బీజేపీ, జనసేన పొత్తుపై అనుమానాలు వస్తున్న సమయంలో  ఏపీలో  తాజా రాజకీయ పరిణామాలు,  తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్  సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీని ఇరుకున పెట్టేలా  ఆయన కామెంట్లు చేశారు.  ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై స్పందించిన పవన్ కల్యాణ్.. మతం పేరిట రాజకీయాలు చేయడం ఇష్టం లేకే తాను రామతీర్థం వెళ్లలేదని  చెప్పారు. మత సామరస్యం కోసం రాజకీయ లబ్ధిని వదులుకుంటానని స్పష్టం చేశారు. మత ప్రస్తావన లేని రాజకీయాలే జనసేన సిద్ధాంతమన్నారు. రామతీర్థం ఘటనకు సంబంధించి పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. రాముడి విగ్రహం ధ్వంసమైన రామతీర్థానికి టీడీపీ నేతలతో పాటు బీజేపీ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు కూడా తలెత్తాయి.  

రామతీర్థం ఘటనలపై  పవన్ కల్యాణ్  చేసిన కామెంట్లతో..  బీజేపీ చేస్తున్నది కూడా మత రాజకీయమేనని ఆయన చెప్పినట్టేననే చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాలపై ఇటీవల తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో ఏపీ ప్రజలు తేల్చుకోవాలంటూ సంజయ్ చేసిన కామెంట్లు జనసేనకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. పవన్ కల్యాణ్ భార్య క్రిస్టియన్. ప్రస్తుతం ఏపీలో  జనసేనతో బీజేపీ పొత్తు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో... క్రిస్టియన్ భార్యగా ఉన్న పవన్ కల్యాణ్ పార్టీతో బీజేపీ పొత్తు ఎలా పెట్టుకుందనే వాదనలు కొన్ని వర్గాల నుంచి వచ్చాయి. ఆ ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేకపోయాయి బీజేపీ, జనసేన. బండి ప్రకటన తర్వాత నుంచి బీజేపీపై పవన్ కల్యాణ్ కొంత అసంతృప్తిగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మత రాజకీయాలంటూ బీజేపీని ఇరుకున పెట్టేలా పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

తిరుపతి ఉప ఎన్నికపైనా హాట్ కామెంట్లు చేశారు పవన్ కల్యాణ్. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో కనుక జనసేన నిలిస్తే ఏడు నియోజకవర్గాల్లోనూ తానే ప్రచారం చేస్తానని చెప్పారు. అభ్యర్థిపై మరో వారంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం మరోమారు సమావేశం కానున్నట్టు చెప్పారు. ఒకవేళ జనసేన కాకుండా బీజేపీ నిలిస్తే హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసినట్టు బలంగా పోటీ చేయాలని కోరారు పవన్ కల్యాణ్. పార్టీ నేతలకూ కూడా ఈ విషయం స్పష్టం చేశారు. జనసేన అభ్యర్థి పోటీలో ఉంటనే పవన్ ప్రచారం చేస్తారా.. బీజేపీ బరిలో ఉండే ఆయన ప్రచారానికి రారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా జనసేన నేతలు , పవన్ కల్యాణ్ తాజా కదలికలను బట్టి తిరుపతిలో బీజేపీ, జనసేన పొత్తు కొనసాగడం కష్టమేనన్న అభిప్రాయమే రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.