Publish Date:Sep 18, 2024
చంద్రబాబు ఓర్పు తనను నిరంతరం ఆశ్చర్యానికి లోనుచేస్తూ వుంటుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో ఏర్పాటుచేసిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతిని పవన్ కళ్యాణ్ వివరిస్తూ, "చంద్రబాబు ఓపిక చాలాసార్లు నన్ను ఆశ్చర్యపరుస్తుంది. పాతికేళ్ల కుర్రాడు కూడా చంద్రబాబులా శ్రమించలేడు. సీఎం బురదలో దిగి నడుస్తుంటే.. జగన్ పార్టీ విమర్శలు చేస్తోంది. వంద రోజుల్లో చాలా హామీలు నెరవేర్చాం. పెన్షన్లు పెంచడానికి ఖజానాలో డబ్బులు లేవు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెన్షన్లు పెంచాం. సంక్షేమం విషయంలో తిరుగులేని చరిత్ర సృష్టించాం. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి వచ్చేవి కావు. నిస్తేజంగా వున్న పంచాయతీలకు ముఖ్యమంత్రి గారు 1,452 కోట్ల రూపాయలు ఇచ్చారు. వైసీపీ సర్పంచులు వున్న పంచాయతీలకు కూడా నిధులు ఇస్తాం. అన్న క్యాంటీన్ల వల్ల పేదలు, కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరుతోంది. ఇంత ఉపయోగకరమైన అన్న క్యాంటీన్లను మూసేయాలని వైసీపీ ప్రభుత్వానికి ఎలా అనిపించిందో అర్థం కాని విషయం. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసి పేదల భూములను రక్షించిన సీఎం గారికి కృతజ్ఞతలు" అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pawan-kalyan-praises-chandrababu-25-185090.html
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.