పవన్ కల్యాణ్ స్పీడ్ మామూలుగా లేదుగా?

Publish Date:Jun 19, 2024

Advertisement

పవన్ కల్యాణ్ అనగానే ఆయన సమయ పాలన విషయంపై పెద్దగా దృష్టి పెట్టరన్న భావన అందరిలోనూ ఉంది. అయితే అది అపప్రద మాత్రమేనని పవన్ కల్యాణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే రుజువు చేశారు. ప్రజా సమస్యల విషయంలో ఇసుమంతైనా ఉదాశీనత ప్రదర్శించబోనని తన తీరు ద్వారా స్పష్టం చేశారు. ఔను ముంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఆయన మినిస్టర్ ఆన్ డ్యూటీ అన్నట్లుగా పనిలోకి దిగిపోయారు. తన శాఖలపై సుదీర్ఘ సమీక్ష చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ అయ్యారు. ప్రజా సమస్యలపై పనుల వేగవంతంపై చర్చించారు. 

ఔను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని పవన్ కల్యాణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే పనిలో దిగిపోయారు. బుధవారం (జూన్ 19)న ఆయన సెక్రటేరియెట్ లోని తన చాంబర్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతే ఆ క్షణం నుంచీ ఆయన డ్యూటీ మొదలెట్టేశారు. తొలి రోజే ఆయన అధికారులతో తన శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్ష కూడా అలా ఇలా కాదు ఏకంగా పది గంటల పాటు సాగింది. అధికారులకు ఆయన మూడు నెలల టార్గెట్ ఫిక్స్ చేశారు.  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులకు ఆయన రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, గ్రామాలలో నీటి కొరత పరిష్కారం తదితర అంశాలపై కార్యాచరణ ప్రణాళిక రెడీ చేయాలని ఆదేశించారు. ఈ సమస్యలన్నీ మూడు నెలల్లో పరిష్కారం కావాలని నిర్దేశించిచారు. అలాగే మూడు నెలలలో వివిధ అంశాలపై సాధించాల్సిన లక్ష్యాలపై టార్గెట్ ఫిక్స్ చేశారు. 

పవన్ కల్యాణ్ ప్రధానంగా గ్రామాలలో రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. అలాగే మౌలిక వసతుల కల్పన, తాగునీటి సమస్యపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు.  ప్రజా సమస్యల పరిష్కారంలో  నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఈ సుదీర్ఘ సమీక్ అనంతరం పవన్ కల్యాణ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ తో తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సంతకాన్ని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసే ఫైలుపై సంతకం చేశారు. రెండో సంతకం గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం దస్త్రంపై రెండో సంతకం చేశారు.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.