ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేగుతోంది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు.. ఆ తదననంతర పరిణామాలు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఎపిసోడ్ ఊహించని విధంగా పెద్ద వివాదంగా మారడంతో.. పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ రూట్‌ను మార్చేశారు. ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
అయితే తెలంగాణ వివాదం తర్వాత పవన్ కళ్యాణ్ కేవలం ప్రాంతీయ రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో ఫోకస్ కావాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు పవన్ వరుసగా జాతీయ మీడియా ఛానళ్లకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వడమే నిదర్శనమంటున్నారు పరిశీలకులు. నేషనల్ మీడియా ముందుకు వచ్చి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కేవలం తెలంగాణ రాజకీయాలకో లేక ఆంధ్రప్రదేశ్ పరిణామాలకో పరిమితం కావడం లేదు. దేశవ్యాప్త ప్రాధాన్యత ఉన్న అంశాలు, జాతీయ ప్రయోజనాలపై ఆయన గట్టిగా గళం వినిపిస్తున్నారు. పహెల్గాం ఉగ్రదాడి వంటి సున్నితమైన అంశాలపై జాతీయ మీడియాలో స్పందిస్తూ.. లౌకికవాదం పేరుతో కొందరు చేస్తున్న రాజకీయాలను తీవ్రంగా తప్పుపట్టారు.
పవన్ కళ్యాణ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఫోకస్ పై దృష్టి పెట్టారనీ, తద్వారా పొలిటికల్ ఇమేజ్‌ను, జనసేన మైలుజ్ నును మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రాంతీయ వివాదాల నుండి పుట్టుకొచ్చిన ఈ వేడిని, పవన్ కళ్యాణ్ తన జాతీయ ఆకాంక్షలకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఎటాక్ ఈజ్ బెస్ట్ డిఫెన్స్ అన్నట్లుగా.. ఒకవైపు తెలంగాణలో పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేస్తూనే, మరోవైపు ఢిల్లీ స్థాయి ఫోకస్ సాధించడంపై ఆయన కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pawan-kalyan-new-strategy-25-222018.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్