ప్రొటోకాల్ పక్కన పెట్టి, భద్రతను తోసిరాజని: బాబుతో పవన్ భేటీ: రాజీనామా వదంతులకు ఫుల్ స్టాప్.!
Publish Date:Oct 22, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. గురువారం (అక్టోబర్ 22) ఆయన కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు. ఎన్నికల సంఘం 100 నియోజకవర్గాల్లో ఎన్నికలను నిలిపివేయడం, ఈ ప్రక్రియపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో వీరిరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తీరుపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు, ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. అన్నిటికీ మించి ఉప ముఖ్యమంత్రి పదవికి పవన్ రాజీనామా చేస్తారనీ, తెలుగుదేశం, జనసేన పొత్తు విచ్ఛిన్నం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మధ్య జరిగిన భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బుధవారం (అక్టోబర్ 21) రాత్రి నుంచీ సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పదవికి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయబోతున్నారని, తెలుగుదేశం పార్టీతో జనసేన తెగతెంపులు చేసుకోనుందంటూ కొందరు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీకి చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఈ వదంతు ప్రచారం అయ్యాయి. దీంతో ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ పవన్ కళ్యాణ్ నేరుగా సీఎం నివాసానికి వెళ్లి ఎలాంటి భద్రత లేకుండా సమావేశం అయ్యారని అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములైన జనసేన, తెలుగుదేశం మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, రాష్ట్ర అభివృద్ధి, ఎన్నికల వ్యూహాలపై ఇద్దరు నేతలు ఎప్పటికప్పుడు స్పష్టమైన సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని ఈ భేటీ మరోసారి చాటింది. ఎలాంటి ప్రోటోకాల్స్‌ను పాటించకుండా, అత్యంత సాధారణంగా పవన్ కళ్యాణ్ సీఎంను ఆయన అధికారిక నివాసానికి వెళ్లి కలవడం ఇరు పార్టీల మధ్యా ఉన్న సఖ్యత, సమన్వయాన్ని మరింత బలంగా చాటిందని పరిశీలకులు అంటున్నారు. [Pawan Kalyan Meet Chandrababu Naidu, AP Politics, Jana Sena TDP Alliance, Local Body Elections, Resign Rumours, Andhra Pradesh Politics, Telugu One]
http://www.teluguone.com/news/content/pawan-kalyan-meet--chandrababu-naidu-39-235048.html





