పవన్ కల్యాణ్ మహా ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే!
Publish Date:Nov 15, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఈనెల 16, 17 తేదీల్లో ఆయన పాల్గొంటారు. పవన్ కల్యాణ్ తెలుగువారు అధికంగా నివసించే మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో ప్రచారం చేస్తారు. ఆయన మహా ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. తన రెండు రోజుల ప్రచారంలో ఆయన ఐదు బహిరంగ సభల్లో, రెండు రోడ్ షోలలో పాల్గొంటారు. తొలి రోజు అంటే శనివారం (నవంబర్ 15) మరట్వాడా ప్రాంతంలోని నాందేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గంలో బహిరంగ సభలోనూ, అదే జిల్లాలో భోకర్ నియోజకవర్గాలో నిర్వహించే హిరంగ సభలోనూ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం లాతూర్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రాత్రి ఆరు గంటలకు షోలాపూర్ నగరంలో రోడ్ షోలో పాల్గొంటారు. ఇక ఆదివారం (నవంబర్ 17) విదర్భ ప్రాంతంలో పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారు. ఆరోజు ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం పూణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం కస్భాపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.
http://www.teluguone.com/news/content/pawan-kalyan-maharashtra-election-campaign-schedule-25-188410.html





