జగన్ చెప్పినట్లే బీజేపీ చేస్తోందా?  పవన్ కల్యాణ్ మాటలకు అర్దమేంటీ? 

Publish Date:Jan 7, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తాజాగా చేసిన ఆరోపణలు హాట్ హాట్ గా మారాయి. ఒక్క లెటర్ రాస్తే సీజేలే బదిలీ అయ్యారు.. మీపై గెరిల్లా యుద్ధం సాధ్యమా అంటూ  జగన్ పై పవన్ సంచలన కామెంట్స్ చేశారు. ఇవే ఇప్పుడు చర్చనీయాంంశంగా మారాయి. న్యాయస్థానాలకు సంబంధించిన విషయాలన్ని కేంద్రం పరిధిలోనే ఉంటాయి.  సీజేల బదిలీ, నియామకాలన్ని కొలిజీయం సిఫారసుల మేరకే కేంద్రం చేపడుతుంది. అయితే  ఒక్క లేఖ రాస్తే చాలు ఏకంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు క్షణాలలో బదిలీ అయిపోతారు అంటూ జగన్ ను ఉద్దేశించి పవన్ కామెంట్ చేయడంతో.. జగన్ లేఖ వల్లే ఏపీ హైకోర్టు సీజే బదిలీ అయ్యారా అన్న చర్చ జరుగుతోంది. అంటే బీజేపీ పెద్దలు జగన్ చెప్పినట్లే చేస్తున్నారనే అర్ధంతో పవన్ మాట్లాడారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 
   
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత అక్టోబర్ లో సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు  లేఖ రాశారు. ఏపీ హైకోర్టు ను సుప్రీంకోర్టు జడ్జి ఎన్ వి రమణ  ప్రభావితం చేస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని ఆ లేఖలో ఆరోపించారు జగన్. మొత్తం 8 పేజీలున్న లేఖలో  తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడికి అనుకూలంగా ఎన్వీ రమణ ప్రయత్నిస్తున్నారని జగన్  పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సీజేకు  జగన్ రాసిన లేఖ అప్పట్లో దేశవ్యాప్తంగా  పెద్ద సంచలనమే అయింది. జగన్ లేఖ రాసిన కొన్ని నెలల్లోనే ఏపీ హైకోర్టు సీజే బదిలీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ వ్యాప్తంగా పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీ జరిగినప్పటికి .. ఏపీ హైకోర్టు సీజే బదిలీ మాత్రం చర్చగా మారింది. తాజాగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో జగన్ కోరిక మేరకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందా అన్న అనుమానాలు కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. 

 వైసీపీ అధినేత జగన్ మొదటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సఖ్యతగానే ఉంటున్నారు. కేంద్రం తీసుకువచ్చిన దాదాపు అన్ని బిల్లులకు పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు సపోర్ట్ చేశారు. గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు వ్యతిరేకిస్తున్న కొత్త వ్యవసాయ బిల్లులకు కూడా వైసీపీ మద్దతు తెలిపింది. ఏపీకి కేంద్రం నుంచి నిధులు సరిగా రాకపోయినా మోడీ సర్కార్ పై పల్లెత్తు మాటలు మాట్లాడటం లేదు ఫ్యాన్ పార్టీ నేతలు. పోలవరం విషయంలో తేడా జరిగినా జగన్ కనీసం స్పందించలేదు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు ఏపీ సీఎం జగన్. ఈ సమావేశంలో న్యాయ సంబంధ విషయాలపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ హైకోర్టు సీజే బదిలీకి ఇది కూడా కారణం కావొచ్చనే వాదనలు కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో బీజేపీ, వైసీపీ మధ్య పెద్ద డీల్ ఉందనే ప్రచారం జరుగుతోంది.  

పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలకు సంబంధించి మరో  ప్రచారం కూడా జరుగుతోంది. ఏపీలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల విషయంలో కేంద్రం స్పందన తాను అశించినంతగా లేదనే అసంతృప్తిలో పవన్ కల్యాణ్ ఉన్నారని చెబుతున్నారు. ముఖ్యంగా హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ.. ఆలయాలపై ఇంత దారుణంగా దాడులు జరుగుతున్నా సీరియస్ గా తీసుకోకపోవడమేంటో తనకు అర్ధం కావడం లేదని పవన్ భావిస్తున్నారట. వైసీపీ, బీజేపీ కలిసే ఓట్ల కోసం కుట్ర రాజకీయం చేస్తున్నాయా అన్న అనుమానం కూడా జనసేన నేతల్లో ఉందంటున్నారు. అందుకే నేరుగా  ఆరోపణలు చేయకుండా జగన్ ను విమర్శిస్తూ.. పరోక్షంగా కేంద్రాన్ని పవన్ కల్యాణ్ టార్గెట్  చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీజేల బదిలీపై కామెంట్ చేశారంటే పరోక్షంగా కేంద్ర సర్కార్ ను ప్రశ్నించినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక లోపు ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరగవచ్చంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీతో కలిసి జనసేన వెళ్లినా అశ్చర్యం లేదంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. తిరుపతిలో కూడా అలాంటిదేమైనా జరుగుతుందేమో చూడాలి మరీ.. 

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.