పదిహేనేళ్ల పాటు బాబే సీఎం..నేనే డిప్యూటీ.. తేల్చేసిన పవన్

Publish Date:Mar 21, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పాలనా పరంగా ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా సాగుతోంది. అభివృద్ధి, సంక్షేమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ జనరంజకంగా పాలన సాగిస్తోంది. పాలనా పరంగా కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులూ లేకపోయినా, కూటమి పార్టీలలో సఖ్యత విషయంలో అనుమానాలు పొడసూపుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం, జనసేనల మధ్య అగాధం ఏర్పడిందన్న అనుమానాలు పొడసూపుతున్నాయి. ఈ విషయమై సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇరు పార్టీల మధ్యా విభేదాలు ఉన్నాయని జనం భావించే లక్ష్యంతో వైసీపీ మీడియా ఈ ప్రచారం సాగిస్తోందని కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆ ప్రచారాన్నిఖండిస్తున్నాయి. అయినా కూడా అనుమానాలు పూర్తిగా నివృత్తి కాని పరిస్థితి ఉంది.

తాజాగా ఇటీవల పిఠాపురం వేదికగా జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో జనసేనాని పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు కొత్తగా ఎమ్మెల్సీ అయిన నాగబాబు చేసిన వ్యాఖ్యలతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే జనసేన, తెలుగుదేశం మధ్య విభేదాలు అభూతకల్పనలేనని పవన్ కల్యాణ్ తేల్చేశారు. అది కూడా జనసేన, తెలుగుదేశం ఎమ్మెల్యేల సమక్షంలో చంద్రబాబును పక్కన పెట్టుకుని తమ రెండు పార్టీల మధ్యా ఎలాంటి పొరపొచ్చాలూ లేవని విస్ఫష్టంగా చెప్పాశారు.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం (మార్చి 20) ముగిశాయి. సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రెండు రోజుల పాటు నిర్వహించిన క్రీడా పోటీలు కూడా అదే రోజు ముగిశాయి. ఈ సందర్భంగా  విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో ప్రజాప్రతినిథుల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. వీటిని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి తిలకించారు. అనంతరం మాట్లాడిన పవన్ కల్యాణ్ తెలుగుదేశం, జనసేనల బంధం సుదీర్ఘ కాలం కొనసాగుతుందని విస్పష్టంగా చెప్పారు. దేశానికి నరేంద్ర మోడీ వరుసగా మూడో సారి ప్రధాని అయ్యారనీ, అలాగే చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉంటారనీ పవన్ కల్యాణ్ అన్నారు. అంటే చంద్రబాబు 15 ఏళ్ల పాటు ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటారనీ, ఈ 15ఏళ్లూ తానే ఉపముఖ్యమంత్రిగా ఉంటాననీ పవన్ కల్యాణ్ చెప్పారు.

కూటమి సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉంటుందనీ, అంత కాలం తెలుగుదేశం అధినేత చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారనీ, తాను ఉప ముఖ్యమంత్రిగా ఆయన కింద పని చేస్తాననీ పవన్ కల్యాణ్ చెప్పారు. ఆయన ఈ మాటలు చెబుతున్న సమయంలో చంద్రబాబు సహా తెలుగుదేశం, జనసేన ఎమ్మెల్యేలు ఆయన వైపే చూస్తు ఉండిపోయారు.  ఈ మాటలతో తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు పొడసూపాయంటూ జరుగుతున్న ప్రచారానికి పవన్ కల్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. చంద్రబాబు పని తీరుకు, ఆయన విజ్ణతకు, దార్శనికతకు తాను అభిమాననని, రాష్ట్రప్రగతి విషయంలో ఆయన చిత్తశుద్ధిపై తనకు పూర్తి విశ్వాసం ఉందనీ పవన్ కల్యాణ్  చెప్పడం ద్వారా తెలుగుదేశంతో జనసేన పొత్తు సుదీర్ఘ కాలం సాగుతుందని తేటతెల్లం చేసేశారు.  

By
en-us Political News

  
బెట్టింగ్ యాప్‌లపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. బెట్టింగ్ యాప్‌ల వలన జీవితాలు నాశనం అవుతున్నాయని తనకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టుపై లోకేష్ తీవ్రంగా రియాక్టయ్యారు.
ఏటీఎం లేని దేశం ఉంటుందంటే నమ్ముతారా? కానీ ఇంతకాలం ఏటీఎం లేని ఆ దేశంలో మొట్టమొదటి ఏటీఎం ఇప్పుడే ప్రారంభించారు. మన దేశంలో ఏటీఎం ప్రారంభించాలంటే ఏ బ్రాంచి మేనేజరో, ఇతర అధికారో వెళ్తారు. కానీ, పసిఫిక్‌ సముద్రంలోని ఓ ద్వీప దేశంలో దీని ప్రారంభోత్సవానికి.. ఏకంగా ప్రధానే హాజరయ్యారు.
పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలోని 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2024, మే నుంచి నవంబర్ వరకు ఈ గౌరవ వేతనం విడుదల చేయనున్నారు. ఈ ఏడు నెలల కాలానికిగాను రూ. 30 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడు నెలలకు ఒకొక్క పాస్టర్‌కు రూ. 35 వేల చొప్పున లబ్ది చేకూరనుంది.
యూపీఐ పేమెంట్స్ పన్ను విధించడంపపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇకపై యూపీఐ చెల్లింపుల మీద GST విధించనున్నారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. దేశంలో ఇకనుంచి రూ.2 వేలకు పైగా చేసే అన్ని రకాల యూపీఐ పేమెంట్స్ మీద కేంద్ర ప్రభుత్వం 18% GST విధించనున్నట్టు వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అబిడ్స్, నాంపల్లి, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం, గాంధీభవన్‌, కార్వాన్, కుత్బుల్లాపూర్, మియాపూర్‌, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, సికింద్రాబాద్‌, గాంధీ ఆసుపత్రి, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు ట్రాఫిక్ జామ్‌ల కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యో చాలా గొప్ప నగరం అని ఇక్కడి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతం అని సీఎం అన్నారు. ‘జపాన్ ప్రజలు సౌమ్యులు, మర్యాదస్తులు, క్రమశిక్షణ కలిగినవారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నాను’ అని సీఎం చెప్పారు తెలంగాణ మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది. జపాన్‌ను ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం ‘తెలంగాణ రైజింగ్’. ఈ రోజు తెలంగాణ జపాన్‌లో ఉదయిస్తోంది అని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రల కమిటీని నియమించింది. ప్రధాని నరేంద్రమోడడీ మే 2న అమరావతికి రానున్న సంగతి తెలిసిందే.
ఏపీ వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయానికి ఆయన వచ్చారు. ప్రస్తుతం సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది.
సహాయం అన్నది మాటల్లో కాదు చేతల్లో ఉండాలి అన్న విషయాన్ని పవన్ కల్యాణ్ నిరూపించారు. అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు.
హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్‌లో యువతిపై అత్యాచారయత్నం కేసులో ఇప్పుడు కీలక మలుపు చోటుచేసుకుంది. అసలు ఆమెపై అత్యాచారమే జరగలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతి అధికారులకు అబద్ధం చెప్పినట్లు తెలిసింది
వేసవి ఉక్కపోతకు సామాన్యులు అల్లాడిపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త పథకంతో ముందుకు రాబోతున్నది. అదే పీఎం ఏసీ యోజన.
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని పట్నం హైవే హోటల్‌లో ఇద్దరు యువకులు తాగిన కూల్ డ్రింక్‌లో చనిపోయిన బల్లి కనిపించింది. హోటల్ యజమానిని ప్రశ్నించడంతో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. హోటల్ యజమాని తీరుపై సదరు యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .ఆహార భద్రత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారా? అన్న ప్రశ్నకు రాజకీయవర్గాలలో ఔననే సమాధానమే వస్తోంది. అయితే వీరి భేటీ ఎప్పుడు? ఎక్కడ జరుగుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.