సుబ్రహ్మణ్యం మీద సుబ్రహ్మణ్యేశ్వరుడిది ప్రేమా.. పగా?

Publish Date:Mar 21, 2025

Advertisement

పదేళ్లలో 103 సార్లు పాము కాటు
ప్రతి సారీ చావు అంచుదాకా వెళ్లి బతికి బట్టకడుతున్న వైనం
హేతువుకు అందని వింత

నాగదేవుడి పేరు పెట్టుకున్న ఆ వ్యక్తిపై పాములు పగబట్టాయా? లేక భక్తి పారవశ్యంతో ఊగిపోతున్నాయా? తెలియదు కానీ సుబ్రహ్మణ్యం అన్న నామధేయం ఉన్న ఆ వ్యక్తిని గత పదేళ్లలో  పాములు 103 సార్లు కాటు వేశాయి. అలా పాము కాటుకు గురైన ప్రతి సారీ అతడు బతికి బయటపడ్డారు. పాము కాటునుంచి తప్పించుకునేందుకు అతగాడు చేయని ప్రయత్నం లేదు. ఊర్లు మారాడు, రాష్ట్రాలు మారాడు. కానీ అదేమిటో అతడెక్కడ పని చేస్తే అక్కడ పాము కాటుకు గురౌతూ వస్తున్నాడు.

ఇది వింతా, మిస్టరీయా తెలియదు కానీ.. సుబ్రహ్మణంను వెతికి వెతికి మరీ పాములు కాటువేస్తున్నాయి. 
విషయమేంటంటే.. చిత్తూరు జిల్లా బైరెడ్డి పల్లి మండలం చల్లారు గుంట వాసి వడ్డెర సుబ్రహ్మణ్యం (47) గత పదేళ్లలో 103 సార్లు పాము కాటుకు గురయ్యాడు. సుబ్రహ్మణ్యం అని నాగదేవత పేరు పెట్టు కున్నసుబ్రహ్మణం ఇలా తరచుగా పాము కాటుకు గురి కావడం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయింది. పాము కాటుకు గురైన ప్రతి సారీ సుబ్రహ్మణ్యం చావు అంచుల దాకా వెళ్లి వస్తున్నాడు.

తాజాగా ఈ నెల 15న మరో సారి అంటే 103వ సారి సుబ్రహ్మణ్యంను పాము కాటేసింది. పెద్ద పంజాణి జేఎంజే అస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. అయితే ఇన్ని సార్లు పాములు సుబ్రహ్మణ్యంనే ఎందుకు కరుస్తున్నాయి..అంటే సమాధానం దొరకదు. పాము కాటుకు గురైన ప్రతిసారీ వైద్య సహాయంతో బతికి బట్టకడుతున్నాడు కానీ, ఆ వైద్యం కోసం సుబ్రహ్మణ్యం తనకున్న మూడెకరాల పొలాన్నీ అమ్మేసుకోవలసి వచ్చింది. ఇప్పుడు భార్యా బిడ్డలతో ఒక పూరి గుడిసెలో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది.  సర్పదోషనివారణ పూజలు,రాహుకేతు పూజలు చేశాడు. అయినా పాములు మాత్రం అతడిని వదల డం లేదు.  మొత్తం మీద ఇన్ని సార్లు పాముకాటుకు గురైన వ్యక్తిగా సుబ్రహ్మణ్యం గిన్నిస్ రికార్డులకు ఎక్కే అవకాశం లేకపోలేదని నెటిజనులు అంటున్నారు. సుబ్రహ్మణ్యం వెర్సెస్ పాములు వెనుక కారణాలు కనుగొనడానికి పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

By
en-us Political News

  
ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల్లో ఇన్‌యాక్టివ్ అయిన వైసీపీ నేతలు ఎవరి వ్యాపాకాల్లో వారు పడ్డారు. తమకు నచ్చింది చేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆ క్రమంలో వైసీపీ కీలక నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. నయా అవతారం ఎత్తారు.
పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. పొడలకూరు మండలంలో జరిగిన అక్రమ మైనింగ్ కేసులో సోమవారం విచారణకు కాకాణి డుమ్మా కొట్టారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. మంగళవారం విచారణకు రావాలని ఆదేశించారు.
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించి నానా హడావుడి చేసిన జగన్ సర్కారు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో తన నివాసం కోసం రుషికొండను తొలిచి ప్రజాధనంతో ఒక భారీ ప్యాలెస్ మాత్రం జగన్ కట్టించారు. దాన్ని ఏం చేసుకోవాలో తెలియని స్థితిలో కూటమి సర్కారు ఉంది.
వరసగా పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో హరిత హారం కార్యక్రమం ఒకటి. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో, హరిత హారం ప్రాజెక్టుకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చింది.
వేసవి వేడి నుంచి తెలంగాణ వాసులకు ఉపశమనం కలగనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మార్చి లోనే ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు, తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న తెలంగాణ వాసులకు రాష్ట్రంలో మూడు రోజులు వాతావరణం చల్లబడనుందన్న చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే. భూముల వేలానికి నిర్ణయం తీసుకున్న సర్కార్ భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆ భూముల చదును కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిని ఏఐజీ ఆస్పత్రి నుంచి ఇలా డిశ్చార్జ్ కాగానే అలా ఎయిర్ అంబులెన్స్ లో ముంబైలోని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కు తరలించారు. ఈ నెల 26న కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మరో నాలుగు రోజుల్లో అంటే ఏప్రిల్ 4 తో ఈ సమావేశాలు ముగుస్తాయి. అయితే,ఇంతవరకు జరిగిన కథ ఒకెత్తు అయితే ఈ చివరి నాలుగు రోజుల కథ మరొక ఎత్తు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవును ఇటు అధికార ఎన్డీఎ కూటమి, అటు విపక్ష ఇండియా కూటమి నాయకులు వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో పట్టు బిగిస్తున్నారు.
మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని మెరుగైన వైద్య చికిత్స కోసం ముంబైకి తరలించాలని ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈనెల 26న తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన కొడాలి నాని సోమవారం (మార్చి 31)న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం తాను పిఠాపురం సీటు త్యాగం చేసి మరీ జనసేనాని విజయం కోసం పని చేసిన వర్మ.. పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు. అప్పటి నుంచీ ఆయనను అంతా పిఠాపురం వర్మ అనడం మొదలైంది.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారా? అక్రమ మైనింగ్ కేసులో నోటీసులు అందజేయడానికి ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులకు ఆయన ఇల్లు తాళం వేసి ఉండటం కనిపించింది. దీంతో ఆయనకు పోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. పోనీ ఆయన పీఏకైనా సమాచారం ఇద్దామని భావించిన పోలీసులకు పీఏ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అని రావడంతో చేసేదేం లేక కాకాణి నివాసానికి నోటీసులు అందించి వెనుదిరిగారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ వరుస సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పోటెత్తున్నది. గత వారం అంతా భక్తుల రద్దీ కొనసాగింది.
 చత్తీస్ గడ్ లో మావోయిస్టులకు కోలుకోని దెబ్బ తగిలింది. ఏకంగా 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు.  ఈ విషయాన్ని  బీజాపూర్ ఎస్ పి  జితేంద్రకుమార్ యాదవ్ మీడియాకు చెప్పారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.