పవన్ కల్యాణ్ ఫ్రం 2014 టు 2024

Publish Date:May 10, 2023

Advertisement

కొణిదెల కల్యాణ్@ కొణిదెల పవన్ కల్యాణ్@ పవర్ స్టార్ పవన్ కల్యాణ్లో కొన్ని అరుదైన గుణాలు ఉన్నాయని ఆయనను దగ్గరగా చూసిన వారు అంటూ ఉంటారు. అన్నచాటు తమ్ముడిగా, సినిమాలలో అడుగులు వేసి, అన్నతోటి తమ్ముడిగా ప్రజారాజ్యంలో కలిసి, అన్నను మించిన తమ్ముడిగా జనసేనతో మెరుస్తున్న పవన్ కల్యాణ్ ది కొంత విలక్షణమైన మనస్తత్వమే.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో  పవన్ కల్యాణ్  పేరు ఒకటి అని చెప్పడానికి అనుమానం అక్కర్లేదు.  2007 అక్టోబర్ లో రివాల్వర్ పట్టుకుని జూబ్లీహిల్స్ రోడ్లపై హల్ చల్ చేసిన పవన్ కు, పీఆర్పీ పెట్టనప్పుడు ప్రసంగాలు చేసిన పవన్ కు, జనసేన అధినేతగా  యిప్పుడు పావులు కదుపుతున్న పవన్ కి చాలా వ్యత్యాసం ఉంది.  కానీ పవన్ కల్యాణ్ కు సినిమారంగంలో దక్కినంత స్టార్ డమ్రాజకీయాలలో దొరకలేదనే చెప్పాలి. ఈ విషయాన్ని పవన్ స్వయంగా అంగీకరించడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం.

సహజంగా గెలిచిన నాయకులు కూడా ప్రజల మొహం చూడని నేటి రాజకీయాలలో సమయం దొరికినపుడు ప్రజలతో కలిసే పవన్ కల్యాణ్ ను ప్రజలు యిష్టపడతారు.  రెండు చోట్లా ఓడించినా ఎప్పుడూ ఎవరినీ పల్లెత్తుమాట అనని పవన్ తన మీద తానే జోకులు వేసుకుని ప్రజలకు దగ్గరయ్యేందకు ప్రయత్నిస్తున్నారు.  యిదంతా పవన్ మేనరిజం అనుకుంటే పొరపాటే. పవన్ తన భావోద్వేగాలను తాను నియంత్రించుకుని రాజకీయ నాయకుడిగా తనను తాను మలచుకుంటున్నారు. పవన్ సినిమాలు, రాజకీయాలు అంటే జోడు పడవల ప్రయాణం చేస్తున్నాడని ఆరోపిస్తున్న వారికి సినిమాలు తన జీవనోపాధి అని చెప్పేశారు.

కనుక సినిమాలు చేయక తప్పని పరిస్థితి అనేది స్పష్టమైంది. గతంలో పవన్ ను కేవలం సినిమా స్టార్ గానే ప్రజలు చూశారనడంలో సందేహం లేదు. కానీ ఆ ఇమేజ్ ని పవన్ మార్చుకోగలిగారు. ఇందుకు పవన్ లోని రాజకీయ నిబద్ధత, కొంత కారణమైనా, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ప్రధాన కారణం.  2014 మార్చ్ 14న ప్రారంభమైన జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం లేకపోవడంతో  2014 ఎన్నికలలో టీడీపీకి మద్దతు ఇచ్చింది. టీడీపీఅధికారలోకి రావడానికి తాము కూడా కారణమని భావించిన జనసేన 2019 ఎన్నికలలో స్వయంగా రంగంలోకి దిగి ఒకే ఒక్క అభ్యర్థిని గెలిపించుకోగలిగింది. దీంతో రాజకీయాలంటే సినిమా కాదని పవన్ కల్యాణ్ కి తెలిసి వచ్చింది.

సహజంగానే 2019 ఓటమి తరువాతే పవన్ కల్యాణ్ లో గుణాత్మకమైన మార్పు వచ్చింది.  గడిచిన నాలుగేళ్లలో అధికార వైసీపీ నాయకులు పవన్ కల్యాణ్ ను మరింతగా పదును పెట్టారు.  క్రమంగా రాజకీయాలు వంటబట్టించుకున్న పవన్ ఎప్పుడూ ర ాష్ట్ర అభివృద్ధి వైపే ఉంటానని చెప్పారు.  తాజాగా టీడీపీకి పవన్ దగ్గరవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది వైసీపీ. అంతే కాకుండా మోడీ ఆశీస్సులు బలంగా పవన్ కల్యాణ్ పట్ల అధికార వైసీపీ ఆచితూచి స్పందిస్తోంది. గతంలో పవన్ వివాహాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగాగమనిస్తున్న జనసేన బృందం ఆచితూచి అడుగులు వేస్తోంది. తెలుగుదేశంతో జతకట్టే అంశంపై రెండో ఆలోచనకు తావులేదనిపవన్ కల్యాణ్జనసేన ముఖ్యనేతలకు తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశంపార్టీతో పొత్తు ఉంటుందని, పవర్ షేరింగ్అనే విషయాలపై ఎవరూ నోరెత్తవద్దని పవన్ కల్యాణ్ తన పార్టీ సీనియర్లకు అల్టిమేటం ఇచ్చారని తెలిసింది. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా త్వరలో బస్సుయాత్ర చేసేందుకు పవన్ సిద్ధంఅవుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. 

ఇదంతా గమనిస్తే  రాజకీయ రంగంలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి పవన్ ఎంత వ్యూహాత్మకంగా పావులుకదుపుతున్నారో అర్ధంఅవుతుంది. అభిమానుల ఆవేశాన్నికంట్రోల్ చేస్తూ, వ్యూహాలకు పదును పెడుతున్న పవన్ 2024 ఎన్నికలలో జనసేనపోటీ చేయబోతున్న సీట్లపై కూడా స్పష్టమైన అవగాహనతో ఉన్నారని తెలుస్తోంది.

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.