సీబీఐ దత్తపుత్రుడు జగన్‌.. వైసీపీ చర్లపల్లి జైలు షటిల్‌ టీమ్‌.. పవన్ ఫైర్‌..

Publish Date:Apr 12, 2022

Advertisement

16 నెలలు జైల్లో ఉన్న‌ జగన్‌, ఆయన బృందం తనకు నీతులు చెప్పడం దారుణమని జనసేనాని పవన్‌ కల్యాణ్ ఫైర్ అయ్యారు. ఇంకోసారి తనను సీబీఎన్‌ దత్తపుత్రుడు అంటే.. జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడు అంటామని స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు. జ‌న‌సేన‌ను టీడీపీ బీ-టీమ్ అంటే.. వైసీపీని చర్లపల్లి షటిల్‌ టీమ్‌ అంటామని హెచ్చ‌రించారు. ఆ మేర‌కు జనసేన నాయ‌కుల‌కు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. 

"మేం ప్రజల పక్షాన పాలసీలపై మాట్లాడుతుంటే.. వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మీరు తిట్టే భాషకంటే ఇంకా మంచి భాష నాకూ వచ్చు. కానీ, ఇలాంటి భాష రాజకీయాలకు వాడి ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించడం నాకిష్టం లేదు. మేం పాలసీలపై మాట్లాడుతున్నప్పుడు మీరు.. సీబీఎన్‌కు దత్తపుత్రుడు అంటే మేం సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది. జనసేన నాయకులు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ చెబుతున్నా.. ఈసారి వైసీపీ వ్యక్తులు సీబీఎన్‌ దత్తపుత్రుడు అంటే జగన్‌ సీబీఐ దత్తపుత్రుడు అని గట్టిగా చెప్పండి" అని సూచించారు. 

"వైసీపీలోని ముఖ్య నాయకులు చాలా మందిని సీబీఐ కోర్టు దత్తత తీసుకుంటుంది. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి జనసేనను టీడీపీ బీ టీమ్‌ అంటున్నారు. ఏదైనా అంటే ఏడుస్తారని భరిస్తూ వచ్చా.. నాక్కూడా సహనం పోయింది. ఈసారి గనుక మమ్మల్ని టీడీపీ బీ టీమ్‌ అంటే.. మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్‌ టీమ్‌ అనాల్సి వస్తుంది. ఎందుకంటే.. చర్లపల్లి జైల్లో చక్కగా 16 నెలలు షటిల్‌ ఆడుకున్నారు. మీరేదో దేశ సేవ చేయలేదు. వల్లభాయ్‌ పటేల్‌ కాదు.. సుభాష్ చంద్రబోస్‌లు కాదు మీరు.. ఆర్థిక నేరాలు చేసి జైల్లో కూర్చున్నారు. మీరు మాకు నీతులు చెప్పొద్దు. మమ్మల్ని విమర్శించే హక్కు.. ఆ స్థాయి కూడా మీకు లేదు" అని పవన్‌ కల్యాణ్ ఫుల్ ఫైర్ అయ్యారు. 

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.