నాగబాబుపై పవన్ కల్యాణ్ ఫైర్.. ఎందుకంటే?

Publish Date:Feb 3, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో  తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ సుప్రీంలో చార్జిషీట్ దాఖలు చేసిన క్షణం నుంచీ ఏపీ రాజకీయం రగులుతోంది. చార్జిషీట్ లో నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నిర్ధారించిందని వైసీపీ అంటుంటే.. తెలుగుదేశం సిట్ చార్జిషీట్ అసలది నెయ్యే కాదని తేల్చిందని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ తన విమర్శల దాడి పెంచి.. అధికార కూటమిని రెచ్చగొట్టి లబ్థి పొందాలని చూస్తోంది. అందులో భాగంగానే.. నెయ్యి కల్తీ వ్యవహారంలో  దూకుడుగా విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసుకుని వైసీపీ విరుచుకుపడుతోంది. పాప ప్రక్షాలన, పరిహారం అంటూ ఆలయాల శుద్ధి కార్యక్రమం చేపట్టింది. 

ఈ నేపథ్యంలోనే జనసేనాని సోమవారం (ఫిబ్రవరి 1) పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ ఒకింత అసహనం, మరింత ఆవేశం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటూ.. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ప్రభుత్వ గళాన్ని వినిపిం చడంలో జనసేన నేతలు ఉదాశీనంగా వ్యవహరించడంపై మండి పడ్డారు. ఎవరి పేరూ ఎత్తకపోయినా, ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆయన తన సోదరుడు నాగబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని అర్ధమౌతోంని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర రెండేళ్లు కావస్తున్నది. ఈ రెండేళ్ల కాలంలోనూ ప్రభుత్వ పరంగా ఎలాంటి అరమరికలూ లేకుండా మూడు పార్టీల నేతల మధ్యా సమన్వయం ఉందన్న విషయం అవగతమౌతున్నది. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం మూడు పార్టీలూ కూడా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి.  రాష్ట్రంలోపెద్దగా సొంత బలం లేని బీజేపీని పక్కన పెడితే.. ప్రధానంగా తెలుగుదేశం, జనసేనల మధ్య క్షేత్రస్థాయిలో అంతగా సమన్వయం కనిపించడం లేదు. ఆ విషయం తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసుకు సంబంధించి వైసీపీ విమర్శలకు దీటుగా బదులిచ్చే విషయంలో ప్రస్ఫుటంగా బహిర్గతమైంది. అంతకు ముందు కూడా పిఠాపురం వర్మ వ్యవహారంలోనూ తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు, సమన్వయ లేమి బయటపడింది. అప్పట్లో అంటే వర్మ వ్యవహారంలో ఇరు పార్టీల మధ్యా పొరపొచ్చాలకు పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు తీరు కారణమన్న విమర్శలు వినవచ్చాయి.

ఇక ప్రస్తుతానికి వస్తే.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి వైసీపీ వ్యాఖ్యలు, విమర్శలకు సమాధానం చెప్పుకోవలసింది తెలుగుదేశం పార్టీయే అన్నట్లుగా జనసేన నేతలు వ్యవహరిస్తూ వచ్చారు. ఒక్క పవన్ కల్యాణ్ వినా మరెవరూ ఈ విషయంలో మాట్లాడకపోవడంతో పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం నడుస్తోంది. ఏ విషయంలోనైనా సరే మూడు పార్టీల గొంతూ ఒక్కటిగానే ఉండాలని పార్టీ నేతలు, కార్యకర్తలు, మంత్రులు, ఎంపీలకు విస్పష్టంగా చెప్పారు. ఆ సమయంలోనే ఆయన ఆడవారి దుస్తుల వ్యవహారంలో మాట్లాడడానికి కావలసినంత సమయం ఉంటుంది కానీ, పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన విషయాలపై స్పందించడానికి తీరిక ఉండదా? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. సరిగ్గా ఇదే ఆయన ఆగ్రహం నాగబాబుపైనా అన్నచర్చకు తెర లేచింది. 

తిరుమలలడ్డూ తయారీకి వినియోగించిన  నెయ్యిలో కల్తీ వివాదం ఇప్పుడు పీక్స్ కు చేరుకుంది. ఈ విషయంపై నడుస్తున్న రాజకీయ వివాదంపై ప్రభుత్వం వాయిస్ ను జనసేన నాయకులూ వినిపించి తీరాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.  కూటమి పరంగా మూడు పార్టీలు అటాక్ చేయాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. చూడాలి మరి జనసేనాని ఆదేశాలతోనైనా జనసేన నేతలు తమ వాణిని బలంగా వినిపిస్తారేమో.

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.