సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవన్ ఎందుకు గైర్హాజరయ్యారో తెలుసా?

Publish Date:Aug 14, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో  కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (ఆగస్టు 13) ప్రారంభించారు. ఈ సందర్భంగా  అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస గృహాల తాళం చెవులను సీఆర్డీఏ  అధికారులు సీఎంకు అధికారికంగా అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రెండు కార్యక్రమాలు అమరావతి పునర్నిర్మాణంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే.. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కీలక  ఈవెంట్‌లోనూ ముందు వరుసలో ఉండే  ఉప ముఖ్యమంత్రి, జనసేనాని  పవన్ కళ్యాణ్  ఈ  కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై చర్చ జరుగుతోంది. దీనిని కూటమి పార్టీల మధ్య విభేదాలుగా వైసీపీ సోషల్ మీడియా కలరింగ్ ఇచ్చి ఓ రేంజ్ లో వైరల్ చేస్తోంది.   భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకోవాల్సి వస్తే ఆప్షన్లు తెరిచి ఉంచుకోవడానికే పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా అమరావతి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంటై వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున పోస్టులు షేర్ చేయడం ప్రారంభించింది. 

 ఈ నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి కారణాలు ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ను రాష్ట్ర మంత్రి నారాయణ స్వయంగా మంగళగిరిలోని  ఆయన క్యాంపు కార్యాలయానికి వెళ్లి మరీ ఆహ్వానించారు.   అయితే సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవం రోజునే.. పవన్ కల్యాణ్ కు అంతకు ముందే నిర్ణయమైన పర్యటన ఖారరై ఉండటంతో రావడం లేదని పొంగూరు నారాయణకు పవన్ కల్యాణ్ చెప్పారు.  

ఆగస్టు 12 ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించే వేడుకలలో పాల్గొనేందుకు ముందుగానే షెడ్యూల్ ఖరారైంది. అటవీ శాఖ మంత్రిగా పవన్ ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. ఈ కాకర్యక్రమానికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఢిల్లీ నుంచి వస్తుండటంతో..పవన్ తన పర్యటన రద్దు చేసుకోలేకపోయారు.   కేంద్ర మంత్రిని తాను స్వయంగా ఆహ్వానించాననీ, అందుకే తప్పని సరిగా హాజరుకావాలని పవన్ ఈ సందర్భంగా మంత్రి నారాయణకు వింరించారు. అంటే ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ఉండటం వల్లనే పవన్ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.  సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పేరు ప్రత్యేకంగా ప్రశంసించి అమరావతి నిర్మాణంలో ఆయన పాత్రను ప్రశంసించారు.

దీనిని బట్టి  తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఇద్దరు అగ్రనేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ప్రభుత్వ నిర్వహణ  సమన్వయంతో సాగుతోందని తేటతెల్లమైంది. తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు ఏర్పడి ఇరు పార్టీలూ విడిపోతే తప్ప రాజకీయంగా తమ మనుగడ కష్టమన్న భావనతోనే వైసీపీ ఇలా లేని విషయాలను కూడా వివాదాస్పదం చేస్తూ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Pawan Kalyan Amaravati event, Seed Access Road Amaravati, Chandrababu Naidu, Narayana Minister, World Elephant Day Visakhapatnam, TDP Janasena Alliance

By
en-us Political News

  
ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల భూములు, ఆస్తులను భూసేకరణ నుండి కాపాడేందుకే యాక్సెస్ రోడ్డును నిబంధలకు విరుద్ధంగా నిర్మించారనీ, ప్రధాన రహదారిలో ఎస్ కర్వ్ ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తూ సందేహాలను ప్రేరేపించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో చేసింది.
తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులపై దాడి చేశారనే ఆరోపణలతో పాటు దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డై బయటకు వచ్చిన నేపథ్యంలో విరూపాక్షపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వరకు ప్రస్తుత రాజకీయ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా మారింది.
అమరావతి కేవలం ప్రజా రాజధాని మాత్రమే కాదు..  దేవతల రాజధాని కూడా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి , జలాలను సేకరించి ఇక్కడ పవిత్ర పూజలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు.
జగన్ హయాంలో పాలన అంటే పంచడం, పంచుకోవడం అన్న చందంగా పరిస్థితి ఉండేది. దాంతో జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏవీ రాలేదు సరికదా.. ఉన్నవి కూడా తరలిపోయాయి. అసలు అప్పట్లో ఏపీ వైపు చూడాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడేలా పరిస్థితులు ఉండేవి.
65 సెంట్ల భూమి విషయంలో కోర్టుకు వెళ్లిన రైతులపై చంద్రబాబుకు ప్రేమ లేదంటూ పేర్ని నాని ఈ సందర్భంగా విమర్శించారు. కానీ వేల ఎకరాలు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చిన రైతుల విషయంలో జగన్ హయాంలో జరిగిందేంటి?
ర్యాలీకి ముందుగానే గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ వీవీ సత్యనారాయణ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు అందజేశారు. అయితే ఆ నోటీసులను ఖాతరు చేయకుండా..  వైసీపీ శ్రేణులు, మద్దతుదారులతో   పార్టీ క్యాంప్ ఆఫీస్ దిశగా ముందుకు సాగారు.
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.