అడవి తల్లి బాటలో గిరిజనులతో మమేకం!

Publish Date:Apr 7, 2025

Advertisement

గిరిజన గ్రామాల అభివృద్ధికి లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్   అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం(ఏప్రిల్ 7) అల్లూరి సీతారామరాజు జిల్లా  డుంబ్రిగూడ మండల పరిధిలోని పెదపాడు గ్రామంలో తారు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి జన్ మన్ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీవీటీజీ గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేస్తూ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామాల్లో రహదారులు, డ్రెయిన్లతో పాటు పాఠశాలలు, తాగునీటి సౌకర్యం, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంతో గిరిజన గ్రామాలకు మహర్ధశ పట్టనుంది.

అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా చాపరాయి నుంచి పెదపాడు వరకు 2.2 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును రూ. 2.12 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు.  అడవితల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతరం పెదపాడు గ్రామస్తులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖాముఖీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా  సౌకర్యాలు లేక తాము పడుతున్న ఇబ్బందులపై గ్రామస్తులు  పవన్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ మేరకు వినతి పత్రం కూడా సమర్పించారు. గ్రామానికి ప్రధాన సమస్య అయిన రహదారి నిర్మాణంతో పాటు చాపరాయి గడ్డ వద్ద బ్రిడ్జి నిర్మించాలని కోరారు. వర్షాకాలంలో గడ్డ పొంగితే రెండు, మూడు వారాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తాగు నీరు, పాఠశాల భవన నిర్మాణం, గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్, రచ్చబండ నిర్మాణంతో పాటు లైబ్రరీ, విలేజ్ హెల్త్ క్లినిక్, సెల్ టవర్ నిర్మించాలంటూ వినతిపత్రం సమర్పించారు.  పెదపాడు గ్రామస్తులు కోరిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని పవన్ హామీ ఇచ్చారు.  గ్రామస్తులు కోరిన 12 అభివృద్ధి కార్యక్రమాలను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.  

ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ  సహకారంతో, ముఖ్యమంత్రి   చంద్రబాబు  గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు స్పష్టం చేశారు. ఓట్లు వేసినా వేయకపోయినా గిరిజనులకు అండగా నిలబడడం మన బాధ్యత అంటూ అడగగానే నిధులు విడుదల చేశారని చెప్పారు. అంతకు ముందు అడవితల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు పెదపాడుకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి   గిరిజనులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. గ్రామ శివారు నుంచి పెదపాడు మహిళలు సంప్రదాయ థింసా నృత్యంతో గ్రామంలోకి ఆహ్వానించారు. 

గ్రామ పర్యటనలో భాగంగా గిరిపుత్రులు తమ ప్రాంతంలో సేంద్రీయ పద్దతిలో పండించే గిరిజన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార కిట్ల పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటున్న చిన్నారులతో ముచ్చటించి వారికి పుస్తకాలు, స్వీట్లు పంచారు.  అనంతరం గ్రామంలో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో కలసి మొక్కలు నాటారు. 

చాపరాయి గెడ్డలో నడుస్తూ.. సమస్యలు వింటూ.. పెదపాడు నుంచి తిరుగు ప్రయాణంలో పోతంగి గ్రామ పంచాయతీ పరిధిలోని 8 గ్రామాల ప్రజలు  కళ్యాణ్ గారిని కలిసి సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఇచ్చారు. చంపపట్టి గెడ్డ మీద ఉన్న బ్రిడ్జి హుదూద్ తుపాన్ సమయంలో ధ్వంసం అయ్యిందని, ఇప్పటి వరకు పునర్నిర్మాణం చేపట్టలేదని చెప్పారు. దీంతో బ్రిడ్జి నిర్మాణం  తక్షణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

By
en-us Political News

  
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.