జనసేనలో పవన్ ప్రక్షాళన...ప్రకాశం జిల్లా పార్టీ కమిటీ రద్దు

Publish Date:May 25, 2026

Advertisement

 

జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. పార్టీలో ఎట్టిపరిస్థితుల్లోనూ క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లా జనసేన కమిటీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

రాజమండ్రి వేదికగా నిర్వహించిన పార్లమెంటరీ స్థాయి కీలక ప్రతినిధులు, క్రియాశీలక కార్యకర్తల సదస్సులో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత పన్నెండేళ్లుగా తాను చూపిస్తూ వస్తున్న ఓపికకు ఇక ముగింపు పలికే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. పార్టీని మరింత పటిష్ఠమైన సైనిక క్రమశిక్షణ గల వ్యవస్థగా రూపాంతరం చెందించేందుకు కఠిన నిర్ణయాలకు వెనుకాడబోనని స్పష్టం చేశారు.

ప్రకాశం జిల్లా కమిటీ పరిధిలో చోటుచేసుకుంటున్న గ్రూపు రాజకీయాల పట్ల పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం పాతిక మంది సభ్యులు ఉన్న చోట ఏకంగా యాభైకి పైగా అంతర్గత వివాదాలు తలెత్తడంపై ఆయన ఆవేదన చెందారు. ఇలాంటి వర్గ విభేదాల కారణంగా ఒకరిని ఒకరు తొక్కేస్తూ, పార్టీ ప్రతిష్ఠను మసకబారుస్తున్నారని నేతల తీరును తప్పుబట్టారు.

సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేస్తూ.. ఇప్పటివరకు పార్టీ శ్రేణులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చానని, కానీ ఇకపై నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. "పార్టీ నిర్దేశించిన మార్గంలో కలిసి నడవండి, లేదంటే తప్పుకోండి" (ఫాల్ ఇన్ లైన్ ఆర్ ఫాల్ అవుట్ ఆఫ్ లైన్) అంటూ గట్టి సంకేతాలు పంపారు.

ఈ నిర్ణయంతో పార్టీలో పదవులు అనుభవిస్తూ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించే ఏ స్థాయి నేతలకైనా కఠిన చర్యలు తప్పవనే స్పష్టమైన హెచ్చరిక వెళ్ళింది. కేవలం ఎన్నికల విజయాలతో సరిపెట్టుకోకుండా, సంస్థాగతంగా పార్టీని పటిష్ఠం చేయడమే తన లక్ష్యమని ఆయన నిరూపించారు.

ప్రస్తుతం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ నిర్ణయం జనసేన శ్రేణుల్లో పెను సంచలనంగా మారింది. పార్టీ అధినేత తీసుకున్న ఈ కఠిన నిర్ణయం తర్వాత జిల్లా రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఎలాంటి వర్గపోరుకు తావులేకుండా సరికొత్త నాయకత్వంతో ప్రకాశం జిల్లాకు సరికొత్త కార్యవర్గాన్ని ప్రకటించేందుకు కసరత్తులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
 

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.