బాలకృష్ణ, పవన్ కల్యాణ్ భేటీ... ఆంతర్యమేమిటి?.. సంకేతాలేమిటి?

Publish Date:Dec 24, 2022

Advertisement

బాలకృష్ణ, పవన్ కల్యాణ్.. ఇద్దరూ రాజకీయ, సినీ  రంగాలలో బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉన్న వారే. బాలకృష్ణ తెలుగుదేశం సీనియర్ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే కాగా పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధినేత. ఇరువురూ రాజకీయ, సినీ రంగాలలో బిజీగా ఉన్నవారే. బాలకృష్ణ సినిమాలూ, ఆన్ స్టాపబుల్ అనేషో, రాజకీయాలలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా రాజకీయాలు, వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అటువంటి వీరిరువురూ భేటీ అయ్యారంటే.. అది సంచలనమే. సర్వత్రా ఆసక్తి కలిగించే విషయమే. అదే జరిగింది.

బాలకృష్ణ సినిమా షూటింగ్ జరుగుతున్న చోటుకు పవన్ కల్యాణ్ వచ్చారు. బాలకృష్ణతో దాదాపు అరగంట సేపు భేటీ అయ్యారు. పలు అంశాలపై ఇరువురి మధ్యా చర్చ జరిగింది.  బాలకృష్ణ ఓ పక్క అన్ స్టాపబుల్ షోతో, సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో రాబోతున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో, పాలిటిక్స్ తో బిజీగా ఉన్నాడు. వీరిద్దరూ కలవడం అనేది చాలా రేర్.   అన్‌స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ వస్తారని వార్త ఇటీవల బాగా వినిపిస్తుంది. అయితే  అందులో నిజమెంతో తెలియదు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ బాలయ్యలు భేటీ అయ్యారు.

వీరి భేటీ సినీ, రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టించింది. వీరి భేటీ వెనుక కారణాలపై విస్తృత చర్చ జరుగుతోంది.  వీరసింహారెడ్డి షూట్ లో పవన్ కళ్యాణ్ బాలయ్యని, చిత్ర యూనిట్ ని కలిసి కాసేపు మాట్లాడారు.   ఆల్ ది బెస్ట్ చెప్పారు. వీరసింహారెడ్డి సినిమాలోని సాంగ్ షూట్ జరుగుతున్న సమయంలో పవన్ వెళ్లారు. బాలయ్య, పవన్ ల భేటీ కి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.  మామూలుగా సినిమా సెట్ లో వీరు భేటీ అవ్వడమే ఇంత సెన్సేషన్ సృష్టించిందంటే.. నిజంగానే బాలయ్య ఆన్ స్టాపబుల్ షోలో  పవన్ కల్యాణ్ కనిపిస్తే మరెంత సెన్సేషన్ అవుతుందోనన్న చర్చ అటు రాజకీయ వర్గాలు, ఇటు సినిమా వర్గాలలోనూ జోరందుకుంది.

వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనవ్వను అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఏపీలో కొత్త రాజకీయ సమీకారణాలపై చర్చకు తెరలేపిన సంగతి విదితమే. ఇప్పుడు బాలయ్య తో పవన్ బేటీ ఏపీ రాజకీయాలలో రానున్న మార్పులకు సంకేతమా అన్న చర్చ జోరందుకుంది. ఎందుకంటే పవన్ కల్యాణ్, బాలకృష్ణలు సినీ హీరోలు మాత్రమే కాదు.. రాజకీయ నాయకులు కూడా. ఇద్దరూ చెరో పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధినేత కాగా, బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, హిందుపురం ఎమ్మెల్యే. అంతే కాకుండా తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమారుడు, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి స్వయానా వియ్యంకుడు. ఈ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు మామ, మేనమామ కూడా. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్, బాలకృష్ణల భేటీ రాజకీయాలలో కొత్త సమీకరణాల చర్చను తెరపైకి తీసుకు వచ్చింది. 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.