పవన్ బీజేపీ ఆడించే తోలుబొమ్మ : మహేశ్ కుమార్ గౌడ్

Publish Date:Jun 15, 2026

Advertisement

 

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఆవిర్భావాన్ని పదేపదే కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిందని, అనేక మంది అమరుల త్యాగాల ఫలితంగా సోనియా గాంధీ తెలంగాణను అందించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావాన్ని అవమానించడం పవన్ కళ్యాణ్‌కు కొత్త కాదని, అదే ధోరణిని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని విమర్శించారు.

బీజేపీ నేతలు చెప్పిన మాటలనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, ఆయన బీజేపీ ఆడించే తోలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇది సినిమా కాదని, ఇష్టానుసారంగా డైలాగులు చెప్పడానికి రాజకీయాలు వేదిక కాదని అన్నారు. తెలంగాణ ప్రజల ఆదరణ వల్లే పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి ఎదిగారని, ఇప్పుడు అదే తెలంగాణను కించపరచడం సరికాదని హితవు పలికారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందని, అధికారం ఉందని తెలంగాణ గురించి ఎలా పడితే అలా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను అధ్యయనం చేస్తే నెహ్రూ, గాంధీ కుటుంబాల త్యాగాలు తెలుస్తాయని, కాంగ్రెస్ గురించి మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలని అన్నారు. దేశ అభివృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కాంగ్రెస్ చేసిన కృషిని గుర్తించాలని పేర్కొన్నారు.

తెలంగాణ విభజనను వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఎక్కడ ఉన్నారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్‌కు లేదని, రాజకీయ పరిపక్వత ఇంకా అవసరమని అన్నారు. బీజేపీ, పవన్ కళ్యాణ్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనే అనుమానాలు వారి వ్యాఖ్యలతో బలపడుతున్నాయని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ముందుకు సాగాలని, రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణను లక్ష్యంగా చేసుకుని మాట్లాడితే ఊరుకోబోమని స్పష్టం చేశారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించకపోవడం వెనుక కూడా ఏదో రాజకీయ అవగాహన ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు.

By
en-us Political News

  
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.