పవన్ కాలికి గాయం.. ఆందోళనలో కూటమి నేతలు

Publish Date:May 8, 2024

Advertisement

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాయపడ్డారు. ఎన్నికలకు గట్టిగా ఐదు రోజుల సమయం కూడా లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూనే, కూటమి అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పవన్ కూటమి శ్రేణుల్లో జోష్ నింపేలా ప్రసంగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. 

అయితే ఆయన కాలికి గాయం కావడం కూటమి నేతలు, శ్రేణుల్లో ఆందోళన కలిగించింది. నిర్విరామంగా పర్యటిస్తూ బహిరంగ సభలలో ప్రసగింస్తున్న పవన్ కల్యాణ్ కు అభిమానుల తాకిడీ విపరీతంగా ఉంది. ఎలాగైనా సరే ఆయనతో సెల్ఫీ దిగాలన్న వారి అత్యుత్సాహం కారణంగానే పవన్ కాలికి గాయమైందని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

రాజమండ్రి, అనకాపల్లిలో ప్రధాని నరేంద్ర మోడీ సభలలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఉత్తేజపూరిత ప్రసంగాలు చేశారు. అయితే ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ తో సెల్ఫీ కోసం అభిమానులు, పార్టీ శ్రేణులూ తహతహలాడిన సందర్భంలో జరిగిన స్వల్ప తొక్కిసలాటలో పవన్ కాలికి గాయమైంది. సాధారణంగా పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బంది ఆయనకు రాక్షణగా ఉంటారు. అయితే ప్రధాని పర్యటన కావడంతో వారు పవన్ కు రక్షణగా ఉండే అవకాశం లేకపోయింది. అనకాపల్లి సభ అనంతరం సెల్ఫీల హడావుడిలో ఎవరో పొరపాటును పవన్ కాలిని తొక్కి ఉంటారనీ, అందుకే గాయమైందని చెబుతున్నారు.   ఆయన రేణిగుంట విమానాశ్రయంలో కాలికి బ్యాండేజితో కనిపించారు. కాలికి గాయమైన ఆయన లెక్క చేయకుండా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తిరుమతిలో చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. 

By
en-us Political News

  
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-6
కొడాలి నాని కోలుకున్నాడు. జూన్ 4న ఓటమిని చవిచూడటానికి సిద్ధంగా వున్నాడు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వచ్చాడు. ఇక్కడకి నోటి దురద సమ్రాట్ వల్లభనేని వంశీ కూడా వచ్చాడు.
కౌంటింగ్ సందర్భంగా కార్యకర్తలు ఎలా రెచ్చిపోవాలో వైసీపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి బోధిస్తున్నారు. కౌంటింగ్ సందర్భంగా నో రూల్స్.. రెచ్చిపోండి అని ఆయన కార్యకర్తలను రెచ్చగొట్టారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీద ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ మే 10న దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
హిందుత్వ వాదాన్ని బలపరిచే గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఐసిస్ తీవ్రవాదుల నుంచి మళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ధృవీకరించారు.  
ఆంధ్ర ప్రదేశ్ లో హాట్ సీట్లలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో కూటమి మద్దతుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటలో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తెలంగాణ అవతరణ పదో వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సమాయత్తమౌతోంది.
జెసీ దివాకర్ రెడ్డి అంటే పాపులారిటీ ఉన్న నేత. రాయలసీమలో జెసి పేరు చెబితే గజగజ వణికే పరిస్థితి ఉంది. అయితే జెసి సంతకాన్నే ఓ నిర్మాణ సంస్థ ఫోర్జరీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన బ్యాలెట్ ఓట్ల కారణంగా ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గతంలో ఎన్నడూ లేని విధంగాభారీగా జరిగింది.
సార్వత్రిక ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి వ్యక్తమౌతోంది. బాధ్యతగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఆ ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే హక్కు ఉంటుంది.
పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ రాజధాని క్వెట్లా సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 28 మంది మరణించారు.
అవినీతిని కూకటి వేళ్లతో పీకి వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. అవినీతి చేపలను ఏరివేసే పనిలో నిమగ్నమైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును బుధవారం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
సరిగ్గా వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం ఏదన్నది తేలిపోతుంది. వైసీపీ మరో సారి అధికారపగ్గాలు అందుకుంటుందా? లేక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అన్న ఉత్కంఠకు వచ్చే నెల 4న తెరపడుతుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.