19 నుంచి పవన్ కల్యాణ్ ఆన్ డ్యూటీ

Publish Date:Jun 17, 2024

Advertisement

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు సెక్రటేరియెట్లో చాంబర్ రెడీ అయిపోయింది. ఆయనకు రెండో బ్లాక్ లోని మొదటి అంతస్తులో 212 నంబర్ రూం కేటాయించారు. అదే అంతస్థులో జనసేన కు చెందిన ఇద్దరు మంద్రుల చాంబర్లు కూడా ఉన్నాయి.

పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ చాంబర్లు పక్కపక్కనే ఉండేలా కేటాయింపులు జరిగాయి. చంద్రబాబు కేబినెట్ లో పవన్ కల్యాణ్ కు తన కేబినెట్ లో కీలకమైన శాఖలు కేటాయించారు.

పవన్ కల్యాణ్ కూడా తనకు కేటాయించిన శాఖల పట్లే కాకుండా, తమ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులకూ కేటాయించిన శాఖల పట్ల సంతృప్తి, సంతోషం కూడా వ్యక్తం చేశారు. తమ పార్టీకి కేటాయించిన శాఖలు తమ పార్టీ మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయన్నారు. ఇక తనకు కేటాయించిన శాఖలు తన మనస్సుకు దగ్గరగా ఉన్నాయని చెప్పిన పవన్ కల్యాణ్.. ఈ నెల 19న బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. 

ఇటీవలి ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకూడదన్న కృత నిశ్చయంతో మూడు పార్టీల నేతలూ, క్యాడర్ కలిసి పని చేయడంతో ఓట్ల బదలీ ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సజావుగా సాగింది. ఫలితమే జగన్  అత్యంత అవమానకరమైన ఓటమిని మూటగట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో 151 స్థానాలలో గెలిచిన వైసీపీ ఈ ఎన్నికలలో 11 స్తానాలకే పరిమితమైందంటే, కనీసం విపక్ష హోదాకు కూడా నోచుకోలేదంటేనే జనం జగన్ ను ఆయన పార్టీని ఎంతగా తిరస్కరించారో అర్ధమౌతుంది.  

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.