తిరుపతిలో పాల్ పర్యటన వినోదాత్మకం

Publish Date:Aug 3, 2022

Advertisement

కేఏ పాల్.. పరిచయం అక్కర్లేని పొలిటికల్ కమేడియన్. ఆయన ఎప్పుడు ఎక్కడ ప్రసంగించినా.. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నవ్వులు పూయడం ఖాయం. ఆయన విమర్శలను ఏ పార్టీ వారూ సీరియస్ గా తీసుకోరు. ఆయన విమర్శలకు ఎవరి నుంచీ ఖండనలు ఉండవు. ఏ పార్టీ వారూ స్పందించరు. అయినా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే విలేకరులు పరుగు పరుగున వాలిపోతారు. ఎలక్ట్రానిక్ మీడియా రెక్కలు గట్టుకుని వాలిపోతారు. పత్రికలలో ఆయన ప్రసంగాలకు స్పేస్ లేకపోవడమనే మాటే ఉండదు.

టీవీలలో ఆయన ప్రసంగాల క్లిప్పింగ్స్ కు ఒకింత ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే జనం ఆయన ప్రసంగాలను అంత ఇష్టంతో వింటారు, చదువుతారు కనుక. మత ప్రబోధకుడి నుంచి రాజకీయ వేత్తగా మారిన తరువాత కేఏ పాల్ తన ప్రసంగాలలో కూడా రాజకీయ ప్రభోదాలే చేస్తారు. అలా ప్రబోధించడంలో ఆయనకు తన పర బేధం లేదు. ఆయన ఎవరినైతే, ఏ పార్టీనైతే విమర్శిస్తారో వారికీ , ఆ పార్టీలకూ కూడా సుద్దులు చెబుతారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అందరూ అంటే అన్ని పార్టీలూ తన వెనుకే నడిస్తేనా ఆ పార్టీలకు మనుగడ అని ఉద్భోదిస్తారు. తాజాగా తిరుపతి పర్యటనలో ఆయన తెలుగు రాష్ట్రాల రాజకీయంపై చాలా చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్, చంద్రబాబులు ఓటమి ఖాయమని తేల్చేశారు. రెండు రాష్ట్రాలలోనూ అధికారంలోకి వచ్చేది తన ప్రజాశాంతి పార్టీయేనని తేల్చేశారు. తాను తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాననీ, ఏపీలో ఒక మహిళా నేతను సీఎంను చేస్తాననీ పాల్ చెప్పారు.  ఏపీలో జనసేనానికి అసలు ప్రజాభిమానమే లేదన్నారు.

తనకున్న ప్రజా మద్దతుతో పోలిస్తే పవన్ కల్యాణ్ కు ఉన్న మద్దతు ఏపాటిదని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ఉనికి కాపాడుకోవాలంటే జగన్, చంద్రబాబు తమతమ పార్టీలను ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయడం బెటరని సలహా ఇచ్చారు. ఇక జాతీయ నేతలకూ ఆయన తన రాజకీయ ప్రబోధం చేశారు. తానిచ్చిన విలువైన సలహాలను పాటించకపోవడం వల్లే మోడీకి ప్రజా మద్దతు భారీగా తగ్గిపోయిందని, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోడీ గద్దె దిగడం ఖాయమనీ జోస్యం చెప్పారు.

పాల్ ఏం చేసినా, ఏం మాట్లాడినా ప్రచారానికి ఢోకా ఉండదు. అయినా ఆయన అదనపు ప్రచారం కోసం కొన్ని ఫీట్లు చేసి మరీ వినోదం పంచుతారు. తిరుపతి పర్యటనలో కూడా అదే చేశారు. ఆయన తన వాహనంలో పద్మావతి మహిళా యూనివర్సిటీలోకి దూసుకెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది వారిస్తున్నా ఆగలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారు వచ్చి ఆయనను పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.

అయితే పాల్ మాత్రం కారులోనూ కూర్చుని తన సొంత వాహనంలోనే   పోలీసు స్టేషన్ కు వస్తానని భీష్మించారు. చివరకు పోలీసులు అతి బలవంతం మీద ఆయనను వర్సిటీ నుంచి బయటకు పంపేశారు. తరువాత తీరిగ్గా కేసు నమోదు చేశారనుకోండి. మొత్తం మీద పాల్ తిరుపతి పర్యటన అంతా వినోదాల జల్లు పంచుతూ సాగింది. 

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.