కీలక మైలురాయి అధిగమించిన పట్టిసీమ.. ప్రాజెక్టు వేస్ట్ అన్న పొలిటికల్ సైంటిస్టులెక్కడ.?

Publish Date:Oct 11, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం   కీలక మైలురాయిని అధిగమించింది. గోదావరి నదిలో వరదల సమయంలో సముద్రంలోకి వృథాగా పోయే అదనపు జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు  500 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణానదిలోకి తరలించారు.

2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది. 1,651 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పథకం ద్వారా కృష్ణా డెల్టాలో  దాదాపు 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరింది.  

అంతే కాకుండా పట్టిసీమ  రాయలసీమకు నీటిని తరలించే పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా వంటి ప్రాజెక్టులకు అవసరమైన నీటి నిర్వహణలో తోడ్పడుతున్నది.  పట్టిసీమ ద్వారా 500 టీఎంసీల నీటి తరలింపు మైలురాయిని చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కృష్ణా డెల్టా రైతులు, నీటి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి అభినందించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపే గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించేందుకు పట్టిసీమను వినియోగంలోకి తీసుకురావడం వల్ల రైతులకు ప్రయోజనం కలిగిందని వారు పేర్కొన్నారు.  పట్టిసీమ  500 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించడానికే కాకుండా, వేల కోట్ల రూపాయల సంపద సృష్టికి కూడా దోహదపడిందని వారు ఈ సందర్భంగా చెప్పారు. 

 వర్షాభావ పరిస్థితుల్లో కృష్ణాడెల్టాకు పట్టిసీమ వరప్రదాయినిగా నిలిచిందన్నంటుననారు.  మొత్తంగా.. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 500 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించడం ఆంధ్రప్రదేశ్ సాగునీటి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయంగా రైతులు ప్రస్తుతిస్తున్నారు.  ఇదే సందర్భంగా పట్టిసీమను పనికిరాని ప్రాజెక్టుగా అభివర్ణించి, విమర్శలు గుప్పించిన జగన్ పై విమర్శల వర్షం వెల్లువెత్తుతోంది. పట్టిసీమ 500 టీఎంసీల జలాల తరలింపు మైలు రాయిని దాటిన వేల.. నాడు పనికి మాలిన ప్రాజెక్టుగా అభివర్ణించిన జగన్ వంటి పొలిటికల్ సైంటిస్టులు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. 

[Pattiseema Project Reach Milestone, Godavari Waters, Krishna Basin, 500 TMC, Interlinking Godavari and Krishna Rivers, Andhra Pradesh Irrigation Project, Krishna Delta Farmers, Telugu One]

By
en-us Political News

  
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతల అరెస్టు వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!
గోల్డ్ కొనాలన్న ఆశ.. బిడ్డను కోల్పోయిన విషాదం.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.