ఇక గుజరాత్‌ వంతు?

Publish Date:Feb 22, 2016

Advertisement

ఒకపక్క హర్యానాలో జాట్ వర్గం తమను వెనుకబడిన తరగతుల్లో చేర్చుకుని తగిన రిజర్వేషన్లను కల్పించమంటూ ఆందోళన చేస్తోంది. ఈ ఆందోళనలు హింసాత్మకరంగా మారి 10 మందికి పైగా మృత్యువాత పడ్డారు. జాట్‌ల ఉద్యమంతో హర్యానా అగ్నిగుండంగా మారిపోయింది. రవాణా సంగతి దేవుడెరుగు... దేశ రాజధాని దిల్లీకే ఈ ఉద్యమం వల్ల మంచినీరు సైతం దక్కని దుస్థితి వచ్చింది. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఎట్టకేళకు కేంద్రప్రభుత్వం కూడా దిగివచ్చి వారి ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందిస్తామంటూ హామీ ఇవ్వవల్సి వచ్చింది.

 

 

హర్యానాలో జరుగుతున్న హడావుడి చూసి ఉత్తేజం పొందాడో ఏమోగానీ గుజరాత్‌లోని హార్ధిక్‌ పటేల్‌ తన గొంతుని పెంచడం మొదలుపెట్టాడు. గత గురువారం నుంచీ హార్ధిక్‌ జైల్లోనే ఆమరణ నిరాహారదీక్షను మొదలుపెట్టాడు. హార్ధిక్‌ దీక్షకు మద్దతుగా గుజరాత్లో ఆందోళనలు మొదలయ్యాయి. అక్కడక్కడా బస్సులను ధ్వంసం చేసిన వార్తలు వినవస్తున్నాయి. పట్టుమని పాతికేళ్లు కూడా లేని హార్ధిక్‌ పటేల్‌ తన వర్గానికి రిజర్వేషన్లను కల్పించమంటూ చాలా రోజుల నుంచీ పోరాడుతున్నాడు. అందుకోసం ‘పాటిదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి’ అంటూ 2015లో సంఘాన్ని సైతం ఏర్పాటుచేశాడు. ఆ సంఘం తరఫున గత ఏడాదికాలంగా హార్ధిక్‌ సాగించిన ఆందోళన కేంద్రప్రభుత్వాన్నే వణికించింది. సాక్షాత్తూ ప్రధానమంత్రి మోదీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లోనే ఆయనను ఇబ్బంది పెట్టింది. హార్ధిక్‌ను చిన్నాచితకా కేసుల కింద అరెస్టు చేసి జైల్లో తోసారు పోలీసులు. ప్రస్తుతానికైతే ప్రభుత్వం కొన్ని పటేల్‌ వర్గం వారికోస రాయితీలను, స్కాలర్‌షిప్‌లనూ ప్రకటించి ఉద్యమాన్ని శాంతింపచేసింది. కానీ హార్ధిక్‌ చర్యలను గమనిస్తుంటే ఉద్యమం మళ్లీ ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

 

 

పటేల్‌ వర్గంవారు వ్యాపారానికి పెట్టింది పేరు. లేదా వ్యవసాయం మీదన్నా ఆధారపడేవారు. ప్రభుత్వ ఉద్యోగాల మీద వారికి ముందునుంచీ శ్రద్ధ తక్కువే. కానీ ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యాపారమూ, వ్యవసాయమూ వారిని నష్టాల్లోకి నెట్టసాగాయి. ఆన్‌లైన్ వ్యాపారంతోనూ, సూపర్‌ మార్కెట్ల ప్రభంజనంలోనూ వారి వ్యాపారాలు దివాళా తీయడం మొదలుపెట్టాయి. పైగా గుజరాత్‌లో కులాల ఓటుబ్యాంకుకి సంబంధించి ఒక ఘోరమైన ప్రయోగం జరిగింది. మాధవరావ్‌ సోలంకీ అనే పెద్దమనిషి ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు 1980వ దశకంలో KHAM అనే ఒక పద్ధతిని కనిపెట్టాడు. KHAM అంటే క్షత్రియులు, హరిజనులు, ఆదివాసీలు, ముస్లింలు అన్నమాట!

 

 

గుజరాత్ జనాభాలో అత్యధికంగా ఉన్న ఈ నాలుగు వర్గాలనూ చేరదీసి వారి సహకారంతో గెలుపుని సాధించడమే మాధవరావ్‌గారి లక్ష్యంగా సాగింది. ఈ ప్రయోగం మాధవరావ్‌ను నేరుగా ముఖ్యమంత్రి కుర్చీ వద్దకు తీసుకువెళ్లింది. కానీ పటేళ్లను శాశ్వతంగా అధికారానికి దూరం చేసింది. సర్దార్‌ వల్లభాయ్ పటేల్ కాలం నుంచీ కాంగ్రెస్‌కు అండగా నిలబడిన పటేల్ వర్గం పార్టీలవారీగా చీలిపోయింది. ఇటు వ్యాపారాలు సరిగా లేక, అటు వ్యవసాయం లాభసాటి కాక, రాజకీయాలలోనూ ఇమడలేక... పటేళ్లలో అంతకంతకూ పెరుగుతున్న ఆందోళనకు హార్ధిక్‌ పటేల్‌ గొంతుకలా నిలిచాడు. రాష్ట్ర జనాభాలో 15 శాతం ఉన్న తమని పట్టించుకోకపోతే ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు మొదలుపెట్టాడు. మరి ఆ హెచ్చరికలు ఎంత దూరం వెళ్తాయో, వాటి పరిణామాలు ఎలా ఉంటాయో రాబోయే రోజులలో చూడాల్సిందే!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.