ఎస్సీ, ఎస్టీ ఓట్ల కోసం తెలంగాణ పార్టీల కొట్లాట!

Publish Date:Jul 16, 2023

Advertisement

తెలంగాణలో ఎన్నికల సమయం వచ్చేసింది. అక్టోబర్ లేదా నవంబర్ లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నుండి సమాచారం కూడా వచ్చేసింది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో ప్రీ ఎలక్షన్ ఏర్పాట్లు కూడా ప్రభుత్వ శాఖలు మొదలు పెట్టాయి. దీంతో రాజకీయ పార్టీలు కూడా  ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రజల మధ్యకు వెళ్లి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కొత్త కొత్త ప్రభుత్వ పథకాలు, పెండింగ్ హామీలను నెరవేర్చే పని చేస్తుంటే.. ప్రతి పక్షాలు నెరవేర్చని హామీలను ఎండగడుతూ కొత్త కొత్త హామీలను ఇస్తూ ఓటర్లను ఆకర్షించే పని చేస్తున్నాయి. అయితే, జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులను లోతుగా చూస్తే తెలంగాణలో రాజకీయ పార్టీలు ఎస్సీ, ఎస్టీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.

ఇక్కడ ప్రధాన పార్టీలలో బీఆర్ఎస్, కాంగ్రెస్   ఎస్సీ, ఎస్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి. ముందుగా బీఆర్ఎస్ ని చూస్తే.. సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడేనని హామీ ఇచ్చారు. కానీ, తీరా రాష్ట్రం సిద్దించి, పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం కుర్చీ ఎక్కారు. అలాగే దళితులకు కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి దాన్నీ వదిలేశారు. దీంతో దళితులలో ఈ అసంతృప్తి కనిపిస్తుంది. దాన్ని మాఫీ చేసి దళితులను ఆకట్టుకునేందుకు దళిత బంధు పేరుతో భారీ మొత్తంలో ఆర్ధిక సాయం అందించేందుకు కేసీఆర్ వ్యూహరచన చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో అక్కడ అధిక శాతం ఉన్న దళితులను తన వైపుకు తిప్పుకొనేందుకు మొదలు పెట్టిన ఈ దళిత బంధు అప్పటి నుండి విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తూ వస్తున్నారు. దీంతో పాటు కొత్త తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా కొత్త పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అంతేకాదు 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని ప్రకాష్ అంబేద్కర్ తో ప్రారంభించారు.

మరో వైపు ఎస్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు కూడా బీఆర్ఎస్ రకరకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంది. ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణలో పోరాటాలు సాగుతున్న పోడు భూముల సమస్యకు ఈ మధ్యనే కేసీఆర్ సర్కార్ చెక్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పెద్ద సంబురంగా జరిపించింది. పోడు భూముల సమస్య తొలగిందంటే అది కేసీఆర్ ఒక్కడి వల్లనే సాధ్యమైందని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎస్టీల చెవులలో రీ సౌండ్ వినిపించేలా ఊరూరా చాటారు. ఈ పోడు భూములలో దాదాపు 90 శాతంగా పైగా భూమి ఎస్టీలకు సంబంధించినదే అంటే కేసీఆర్ ఏ స్థాయిలో వ్యూహ రచన చేసారో అర్ధం చేసుకోవచ్చు. దీంతో పాటు ఎస్టీలకు సంబంధించి ఐటీడీఏల పరిధిలో గిరిజనులకు ఉపాధి కలిగించేలా రకరకాల పేర్లతో యూనిట్లు మంజూరు చేస్తున్నారు.

ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే గతంలో కేసీఆర్ ఉద్యమం సమయంలో ఏ హామీలు అయితే ఇచ్చి అమలు చేయలేదో కాంగ్రెస్ వాటినే ఫోకస్ చేసి ప్రజలలోకి వెళ్లేలా చేస్తుంది. కేసీఆర్ చెప్పిన దళిత సీఎం ఛాన్స్ కాంగ్రెస్ లో మాత్రమే ఉందనేలా కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంది. కాంగ్రెస్ లో దళిత నేత భట్టి విక్రమార్క, ఎస్టీ మహిళా నేత సీతక్కల పేర్లు ఇప్పటికే కాంగ్రెస్ దిగ్విజయంగా ఫోకస్ లోకి తెచ్చి పెట్టింది. దీంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాల భూమి కేటాయిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. కేసీఆర్ దళిత బంధు ఇస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్టీలకు కూడా భారీ ఆర్ధిక సాయం అందించే పథకం తెస్తామని చెప్తున్నారు. ఇలా మొత్తంగా చూస్తే ఒక వైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ ఓట్లపైనే కన్నేసి అధికారం దక్కించుకోవాలని చూస్తున్నాయి. మరి తెలంగాణ ఎస్సీ, ఎస్టీలు ఈసారి ఎవరిని నమ్మి ఓట్లేస్తారో చూడాలి.

By
en-us Political News

  
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.