పార్థా చటర్జీకి ఉద్వాసన పలికిన మమత

Publish Date:Jul 28, 2022

Advertisement

టీచర్ రిక్రూట్ మెంట్ కుంభకోణంలో అరెస్టయిన పార్థా చటర్జీ మంత్రి పదవి ఊడింది. ఆయనకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ప్రకటించారు. పార్థా చటర్జీ ఉద్వాసన తక్షణం అమలులోకి వస్తుందని చెప్పారు. టీచర్ల రిక్రూట్ మెంట్ కుంభకోణానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా చటర్జీని ఈడీ అధికారులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి విదితమే.

ఆయన తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడని చెబుతారు. అయితే టీచర్ రిక్రూట్ మెంట్ స్కాంలో ఈడీ అధికారులు  తనను అరెస్టు చేయడానికి ముందు ఆయన పలు మార్లు మమతా బెనర్జీకి ఫోన్ చేసినా ఆమె స్పందించలేదని అంటున్నారు.పార్థా చటర్జీ సన్నిహతురాలు అర్పిత ముఖర్జీ నివాసాలలో ఈడీ అధికారులు దాదాపు 50 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అర్పిత ముఖర్జీకి చెందిన రెండు ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు అక్కడ స్వాధీనం చేసుకున్న నగదును లెక్కించడానికి నాలుగు క్యాష్ కౌటింగ్ మిషన్లను ఉపయోగించారని చెబుతున్నారు. ఆ సొమ్ము లెక్కించడానికి దాదాపు 13 గంటలు పట్టిందంటున్నారు.

అమెకు చెందిన రెండు ఇళ్లలో లభించిన సొమ్ము 49.8 కోట్ల రూపాయలు అని చెబుతున్నారు. టీచర్ల నియామక కుంభకోణంలో పార్థా చటర్జీ అడ్డంగా దొరికిపోవడంతో బెంగాల్ లోని మమత సర్కార్ చిక్కుల్లో పడింది. పార్ఠా వ్యవహారంతో సంబంధం లేదని చెప్పుకోవడానికి నానా తంటాలూ పడుతోంది. అందుకే ఆయనను కేబినెట్ నుంచి తొలగించింది. చట్టం తన పని తాను చేసుకు పోతుందని ఇందులో ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని చెప్పుకుంటోంది.

పార్థా చటర్జీ ఫోన్ కాల్స్ ను మమత ఆన్సర్ చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఏది ఏమైనా కుప్పలుగా పోసిన నోట్ల కట్టలు బయట పడడంతో,   తృణమూల్ ప్రభుత్వంలో అవినీతి  జనానికి తెలిసినట్లయ్యింది. ట్రక్కులలో తరలిస్తున్న నోట్ల కట్టలు తృణమూల్ నాయకత్వాన్ని డిఫెన్సులోకి నెట్టి వేశాయి. ఇదలా ఉంటే పార్థా కుంభకోణానికి సంబంధించి ఈడీ సోదాల్లో కుప్పలుగా పోసిన నోట్ల కట్టలతో  పాటుగా, రాసులుగా పోసిన బంగారు  ఆభరణాలు కూడా బయట పడటం సంచలనం సృష్టిస్తోంది.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.