అడగందే కేంద్రమయినా పెట్టదు!

Publish Date:Mar 1, 2016

Advertisement

 

కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఓ కొలిక్కి తీసుకురావడమంటే, ఏదో మీట నొక్కితే జరిగిపోయే వ్యవహారం కాదు. ఆ రాష్ట్రంలోని అధికారులు, నేతలు, ప్రజలు దశాబ్దాల తరబడి నిబద్ధతతో కృషి చేస్తే కానీ సాధ్యమయ్యే విషయం కాదు. అంతిమంగా కేంద్రం నుంచి ఆసరా లేనిదే, అభివృద్ధి అడుగు కూడా ముందుకు సాగదు. ఇలాంటి సందర్భంలో, నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమేరకు చేయూతని అందిస్తోంది అంటే... ఠక్కున ఏదీ గుర్తుకురాని పరిస్థితి.

2014లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) అధికారంలోకి వచ్చేందుకు తెలుగుదేశం ఇచ్చిన సహకారం అంతా ఇంతా కాదు. 16 సీట్లతో ఆ కూటమిలో మూడో అతి పెద్ద పార్టీగా తెలుగుదేశం ఉంది. ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ వంటి పెద్దపెద్ద నేతలే, విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్రంగా అన్యాయం జరిగిందనీ, దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సరిదిద్ది తీరతామని హామీని ఇచ్చారు. అసలే విభజన గురించి కోపంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మీద ఈ హామీలు బాగానే పనిచేశాయి. తమ ఓట్లన్నింటినీ తెదెపా, వైకాపాలకు మాత్రమే వేశారు. 2009లో 33 లోక్‌సభ స్థానాలు కలిగిన కాంగ్రెస్‌కు గుండుసున్నా మిగిల్చారు.

 

పాలనలో ఒకో రోజూ గడుస్తున్న కొద్దీ, ఒకో బడ్జెట్‌ వెలువడుతున్న కొద్దీ, ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే కనిపించకుండా పోతో్ంది. చిన్నపాటి హామీలు సైతం వినిపించడం లేదు. ఉదాహరణకు, విశాఖ రైల్వేను ఒక ప్రత్యేక జోన్‌గా ప్రకటించాలని ఎప్పటినుంచో అక్కడి ప్రజలు కోరుతున్నారు. తూర్పుతీరంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన విశాఖను ప్రత్యేక జోన్‌గా ప్రకటిస్తే, పాలనాపరమైన సౌలభ్యంతో పాటుగా, రద్దీని నియంత్రించేందుకు అవసరమయ్యే చర్యలన్నింటినీ తీసుకునే అవకాశం ఉంది. ఇంత చిన్న హామీని కూడా రైల్వే బడ్జెట్‌ తీర్చలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక జోన్‌ను అందిస్తామని ‘ఆంధ్రప్రదశ్‌ పునర్విభజన చట్టం’లో పేర్కొన్నప్పటికీ ఈ కల నెరవేరలేదు.

 

ఇక మొన్నటికి మొన్న ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో గణాంకాలు కూడా, ఆంధ్రప్రదేశ్‌కు అంత అనుకూలంగా లేవు. ప్రత్యేక ప్యాకేజీ ఊసు కానీ, లోటు బడ్జెటును పూడుస్తామన్న హామీ కానీ నెరవేరలేదు. వేల కోట్లు అవసరమయ్యే పోలవరం వంటి ప్రాజెక్టులకి నామమాత్రంగా 100 కోట్లను కేటాయించి ఊరుకున్నారు. మిత్రపక్షం, అందులోనూ కష్టాల్లో ఉంది కాబట్టి పెద్దగా ప్రతిఘటించదులే అన్న ఆలోచనలో అరుణ్‌జైట్లీ ఉన్నారేమో తెలియదు. అందుకే బడ్జెట్లో కనిపించిన చిత్రాలకు బిత్తరపోయిన చంద్రబాబు, ఆర్థికమంత్రికి ఫోన్‌ కలిపి తన కోపాన్ని వెలిబుచ్చిన తరువాత కానీ పరిస్థితిలో మార్పు కనిపించలేదు. కేంద్ర మంత్రి ఉమాభారతి హడావుడిగా తాము 100 కోట్లు కాదు, 1600 కోట్లు కేటాయించనున్నట్లు పత్రికా ముఖంగా ప్రకటించారు.

 

ఈ సంఘటనతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి ఓ విషయం అర్థమై ఉంటుంది. వడ్డించేవాడు మనవాడే అయితే... అన్న సామెతను పక్కన పెట్టి, రాష్ట్రానికి రావల్సిన వాటాల విషయంలోనూ, తీరాల్సిన హామీల విషయంలోనూ గట్టిగా పట్టుపట్టి, అవసరమైనప్పుడు గొడవపడితే కానీ పనులు జరిగేట్లు లేవు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే ఈ సూత్రం పాటించక తప్పదు మరి!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.