కేబినెట్ లోకి పల్లా! వాణిదేవీకి కీలక పదవి

Publish Date:Mar 23, 2021

Advertisement

తెలంగాణలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ప్రజా వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా.. అధికార టీఆర్ఎస్ పార్టీ రెండు సీట్లలో విజయం సాధించింది. నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానం నుంచి వరుసగా రెండోసారి జయకేతనం ఎగురవేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. బీజేపీకి సిట్టింగ్ స్థానమైన   హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు కూతురు వాణిదేవీ సంచలన విజయం సాధించారు. నిజానికి ఈ రెండు సీట్లలో గులాబీ పార్టీకి ఏమాత్రం గెలిచే అవకాశం లేదని అంతా భావించారు. అందుకే అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదనే ప్రచారం జరిగింది.  కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీకి మొదట వెనుకంజ వేసినా.. సీఎం సూచనతో రంగంలోకి దిగారంటున్నారు. ఇక హైదరాబాద్ స్థానంలో వాణిదేవీని చివరి నిమిషంలో బరిలోకి దింపారు గులాబీ బాస్. 

ప్రతికూల పరిస్థితిల్లో పోటీలో దిగి విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణిదేవీకి కీలక పోస్టులు దక్కనున్నాయని తెలుస్తోంది. తనకు నమ్మకస్తుడిగా ఉన్న పల్లాను కేబినెట్ లోకి తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. కొంత కాలంగా పాలనతో పాటు పార్టీ వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ అంతా ఆయన డైరెక్షన్ లోనే జరిగింది. కేబినెట్ లో లేకపోయినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయనదే హవా నడుస్తుందనే చర్చ ఉంది. తీవ్ర వ్యతిరేకత ఉన్నా ఎమ్మెల్సీగా గెలవడంతో పల్లా ఇమేజ్ మరింత పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా వ్యూహాల ముందు విపక్షాలు చిత్తయ్యాయని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వంపై తీవ్ర కోపంగా ఉన్న ఉద్యోగులను మచ్చిక చేసుకోవడంలో పల్లా సక్సెస్ అయ్యారని అంటున్నారు. పోల్ మేనేజ్ మెంట్ లోనూ విపక్షాలకు పల్లా చుక్కలు చూపించారనే చర్చ జరుగుతోంది. మొత్తంగా తమకు కష్టమనుకున్న సీటులో గెలిచి.. వరుస ఓటములతో డీలా పడిన పార్టీలో జోష్ వచ్చేలా చేసిన పల్లాను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ దాదాపుగా నిర్ణయించారని ప్రగతి భవన్ వర్గాల సమాచారం.

కేసీఆర్ మంత్రివర్గంలో ప్రస్తుతం ఖాళీలు లేవు. పల్లాను తీసుకుంటే ఒకరిని తొలగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటే... ఆయన సామాజికవర్గానికే చెందిన మంత్రికి ఉద్వాసన ఖాయమంటున్నారు. మేడ్చల్ జిల్లాకు చెందిన మల్లారెడ్డికి షాక్ తప్పకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటి నుంచి కేసీఆర్ పై విమర్శలు వస్తున్నాయి. భూదందాల్లోనూ ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలతోనూ మల్లారెడ్డికి పొసగడం లేదు. అంతేకాదు గత లోక్ సభ ఎన్నికల్లో మల్లారెడ్డి అల్లుడికి ఎంపీ టికెట్ ఇచ్చినా.. గెలిపించుకోలేకపోయారు మల్లారెడ్డి. దీంతో పల్లాను తీసుకోవడం కోసం మంత్రివర్గం నుంచి మల్లారెడ్డిని తప్పించడం ఖాయమని చెబుతున్నారు. 

ఇక బీజేపీ సిట్టింగ్ స్థానమైన హైదరాబాద్ లో టీఆర్ఎస్ పోటీ చేయడం లేదనే ప్రచారం జరిగింది. అభ్యర్థులు లేకపోవడంతో పోటీ నుంచి తప్పుకుని నాగేశ్వర్ కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని కూడా అన్నారు. కాని అనూహ్యాంగా బరిలోకి దిగిన వాణిదేవీ... అద్భుత విజయం సాధించారు. నిజానికి హైదరాబాద్ స్థానంలో పోటీకి వాణిదేవీ సిద్దం కావడమే సంచలనం అంటున్నారు. ఓడిపోయే సీటు అని తెలిసినా ఆమె ఎందుకు పోటీ చేస్తున్నారో అంటూ విపక్షాలు సెటైర్లు కూడా వేశాయి. అయినా ధైర్యంగా పోటీ చేసిన వాణీదేవీ.. అనూహ్య  విజయం సాధించారు. హైదరాబాద్ లో టీఆర్ఎస్ విక్టరీకి వాణీదేవీ అభ్యర్థిత్వమే కారణమని టీఆర్ఎస్ నేతలే చెబుతున్నారు. అందుకే వాణిదేవీని ఎమ్మెల్సీతో సరిపెట్టకుండా కీలక పదవి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అధినేతకు ఇదే సూచన చేశారని తెలుస్తోంది.

వాణిదేవీకి ఏ పదవి కట్టాబెట్టాలన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతుందని తెలుస్తోంది. పలు విద్యాసంస్థలకు అధినేతగా ఉన్న వాణిదేవీకి విద్యాశాఖ మంత్రి అయితే సరిగ్గా సరిపోతుందనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న సబితాఇంద్రారెడ్డిని రెండో దశలో కేబినెట్ లోకి తీసుకున్నారు. తెలంగాణలో తొలి మహిళా మంత్రిగా ఆమె నిలిచారు. దీంతో ఆమెను తప్పిస్తే బాగుండదనే చర్చ గులాబీ నేతల్లో జరగుతుందట. కేబినెట్ బెర్త్ కాకుండా వాణిదేవీకి శాసనమండలి చైర్మెన్ పదవి ఇవ్వాలని సూచన కొందరు నేతలు చేశారంటున్నారు. ప్రస్తుతం మండలి చైర్మెన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కొంత కాలంగా అనారోగ్యంగా ఉంటున్నారు. దీంతో ఆయనకు రెస్ట్ ఇచ్చి.. వాణిదేవీకి ఆ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని విజయాలు సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి,  సురభి వాణిదేవీలకు కీలక పదవులు దక్కడం మాత్రం ఖాయమంటున్నాయి టీఆర్ఎస్, తెలంగాణ భవన్, ప్రగతి భవన్ వర్గాలు. 

By
en-us Political News

  
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత, జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడంలేదు. ఏవో నాలుగైదు సందర్భాలలో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అవి వివాదాలకే దారి తీశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.