వైసీపీపై రెచ్చిపోయిన పాల్ ..టచ్ చేస్తారా? దమ్ముందా?

Publish Date:Nov 26, 2022

Advertisement

తెలుగు రాష్ట్రాలలో రాజకీయ జోకర్ గా కేఏ పాల్ కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన మాటలు, చేష్టలకు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రీజ్ ఉంది. ప్రజాశాంతి పార్టీ అధినేతగా ఆయన ఎన్నికల బరిలో దిగుతారు. ప్రజాదరణ, ఎవరు ఓటేస్తారు? ఎన్ని ఓట్లు వస్తాయన్న అంచనాలతో సంబంధం లేకుండా కోటలు దాటేలా ప్రసంగాలు చేస్తూ తన విజయం ఖాయమని ప్రకటించేస్తారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికనే తీసుకుంటే.. ప్రజలలో కలిసి ఆయన చేసిన డ్యాన్సులు, పోలీంగ్ బూతుల వద్ద పెట్టిన పరుగులు విపరీతంగా వైరల్ అయ్యాయి. అటువంటి పాల్ తాజాగా ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్, ఆయన కేబినెట్ లోని మంత్రులను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , మంత్రి  రోజా, మాజీ మంత్రి కొడాలి నానిపై కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను, శ్రేణులను విస్మయానికి గురి చేస్తున్నాయి. కేఏ పాల్ ఏంటీ.. ఇలా మాట్లాడడం ఏమిటని నివ్వెరపోతున్నాయి.

అంతేకాదు.. కేఏ పాల్ వీడియో.. రిపీటెడ్ గా చూస్తుండటంతో ఆ వీడియోకు వ్యూస్ కూడా భారీగా పెరిగాయి.  అలాంటి వేళ.. ఫ్యాన్ పార్టీలో నోరున్న నేతలంతా  ప్రెస్ మీట్ పెట్టి.. కేఏ పాల్‌పై మాటల దాడికి దిగుతారా? అన్న చర్చ అయితే  వైసీపీ నేతల్లో మొదలైంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆయనపై దోమ కాదు కదా ఈగ కూడా వాలనివ్వకుండా.. తొలి కేబినెట్‌లోని మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు ఎక్సెట్రా ఎక్సె ట్రా వంటి వారు చాలా జాగ్రత్తగా చూసుకున్నారని .. అలాంటి  వారంతా ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగి ప్రెస్‌మీట్ పెట్టి.. తమ మాటల తూటాలు పేలుస్తారా? లేక సైలెన్స్ మెయిన్టైన్ చేస్తారా? అని వైసీపీ శ్రేణులు ఆసక్తిగా, ఆతృతగా చూస్తున్నారు. కానీ మాజీలైన  ఆ మంత్రులందరూ పదవి కోల్పోయిన తరువాత  మీడియా ముఖం చాటేస్తున్న సంగతిని గుర్తు చేసుకుని నిరుత్సాహపడుతున్నారు.  

ఇక  మంత్రి ఆర్కే రోజా, అంబటి రాంబాబు  వంటి వారే అయినా స్పందిస్తారా అని ఎదురు చూస్తున్నారు.  ఓ వేళ స్పందించినా..   రోజా మాత్రం తనదైన శైలిలో పంచ్ డైలాగులు గుప్పిస్తారని అంటున్నారు. అయితే తాజా వీడియోలో సీఎం జగన్‌పై కేఏ పాల్ మాట్లాడినట్లు.. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, లేదా జనసేనాని పవన్ కల్యాణ్   మాట్లాడి ఉంటే.. వీరంతా ఇప్పటికే  విమర్శలతో, పరుష పదజాలంతో రెచ్చిపోయేవారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.

తాజా వీడియోలో.. కేఏ పాల్.. సీఎం జగన్, మంత్రి   రోజా, మాజీ మంత్రి కొడాలి నానిలపై చేసేన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు గత మూడున్నరేళ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ సైతం చేయలేదని నెటిజన్లు భలే ఎంజాయ్ చేస్తున్నారు.

 జగన్ పార్టీ లో నోరేసుకు పడిపోయే నేతలనే తలదన్నేలా  కేఏ పాల్ తాజా వీడియోలో చెలరేగిపోయారని నెటిజన్లు అంటున్నారు.  ఇప్పుడు   కేఏ పాల్‌కు ఎవరు..  ఏ స్థాయిలో  కౌంటర్ ఇస్తారో వేచి చూడాలని   కామెంట్లు  చేస్తున్నారు.   

By
en-us Political News

  
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.