టి20 వరల్డ్ కప్ ఫైనల్స్ కు పాకిస్థాన్.. న్యూజిలాండ్ ఇంటి ముఖం

Publish Date:Nov 9, 2022

Advertisement

టి20 వరల్డ్ కప్ లో కేవలం అదృష్టం కలిసి వచ్చి నాకౌట్ కు చేరుకున్న పాకిస్థాన్ సెమీస్ లో  అదరగొట్టింది. అన్ని విధాలుగా తన కంటే బలమైన న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ లో సమష్టి గా రాణించింది. చివరికి 7 వికెట్ల తేడాతో కవీస్ ను మట్టికరిపించి ఘనంగా ఫైనల్ లో అడుగు పెట్టింది. ఫైనల్ లో పాకిస్థాన్ ప్రత్యర్థి ఎవరన్నది తేలాలంటే గురువారం (నవంబర్ 10 వరకూ ఆగాల్సిందే.

ఆ రోజు భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో విజేత జట్టుతో పాక్ ఫైనల్ లో తలపడుతుంది. ఇక న్యూజిలాండ్- పాకిస్థాన్ మ్యాచ్ విషయానికి వస్తే  అన్ని విభాగాల్లోనూ పాకిస్థాన్ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. ఆట మొత్తంలో ఎక్కడా న్యూజిలాండ్ కు అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యాన్నిప్రదర్శించింది.  టాస్ గెలిచిన న్యూజిలాండ్  తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.

కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ 42 బంతుల్లో 1 ఫోర్, ఒక సిక్స్ తో 46పరుగులు చేశాడు. డెరిల్ మిఛెల్ మెరుపు బ్యాటింగ్ తో 35 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ తో 53 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. దీంతో 153 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.  బాబర్ అజామ్ సరిగ్గా సమయానికి ఫామ్ దొరకపుచ్చుకున్నాడు. 43 బంతుల్లో 7 ఫోర్లతో 53 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు.

మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ కూడా చెలరేగి ఆడటంతో ఏ దశలోనూ న్యూజిలాండ్ పోటీలో లేకుండా పోయింది.  రిజ్వాన్ 43 బంతుల్లో  5 ఫోర్లతో 57 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్ లో ఫిలిప్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరువాత 19వ ఓవర్ చివరి బంతికి మహ్మద్ హారిస్ ఔటయ్యాడు.శాంట్నర్ బౌలింగ్ లో అలెన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

హారిస్ 26 బంతుల్లో రెండు ఫోర్లు 1 సిక్సర్ తో 30 పరుగులు చేశాడు. విజయానికి చివరి ఓవర్ లో పాకిస్థాన్ రెండు పరుగులు చేయాల్సి ఉంది. చివరి ఓవర్ తొలి బంతిని సౌథీ వైడ్ వేశాడు. ఆ తరువాతి బంతికి మసూద్ సింగిల్ తీసి లాంఛనం పూర్తి చేశాడు.  ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే పాకిస్థాన్ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. దీంతో పాకిస్థాన్ టి20 ఫైనల్ కు దూసుకెళ్లింది. 

By
en-us Political News

  
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రకృతిని ఎదిరించి జీవించడం ఎవరికీ సాధ్యం కాదని, దానితో ఘర్షణకు దిగితే మానవాళి తీవ్ర విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు.
DRDO ఉద్యోగి ఎదురింట్లో ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు.. అవకా శం కోసం ఎదురుచూశాడు యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి చొరబడ్డాడు.
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి.
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
భారత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.
న్నబిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయత.. కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితి.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ భద్రతా రంగంలో తీవ్ర కలకలం రేపిన ఒక పెద్ద ఉదంతాన్ని ఎదుర్కొంది.
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.