ఇండియాపై మళ్లీ విషం కక్కిన పాక్ రక్షణ మంత్రి.!

Publish Date:Jul 29, 2026

Advertisement

పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్ నిప్పుల గుండంగా ఉంది. పాకిస్థాన్ ప్రభుత్వంపై పీవోకే ప్రజలు ఒక రకంగా తిరుగుబాటు ప్రకటింారు.    ప్రాథమిక హక్కుల కోసం,  రాజకీయ ప్రాతినిధ్యం కోసం రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు. ఒక రకంగా పీవోకేలో పరిస్థితి సివిల్ వార్ ను తలపిస్తోంది.  ఇటువంటి పరిస్థితుల్లో    పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాల్సిన పాక్ పాలకులు.. పీవోకేను శత్రుదేశంగా అభివర్ణిస్తూ అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు.  ముఖ్యంగా పాకిస్థాన్ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పాక్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో పీవోకే నిరసనకారులను ఇండియా లాగే వాళ్లు కూడా పాకిస్థాన్ కు శత్రువులు అంటూ ప్రేలాపనలు చేస్తున్నారు. పీవోకే నిరసనకారులను భారత్ లాగే శత్రువులు అంటూ పాక్ రక్షణ మంత్రి  ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.  

ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ తాను  పీఓకేలో నిరసనలు చేస్తున్న వారిని భారత్‌తో సమానమైన వర్గంలో చేరుస్తున్నానని పేర్కొన్నారు. వారిని కూడా భారతదేశం లాంటి శత్రువులుగానే పరిగణిస్తున్నాననీ, అందుకే ఆ ఆందోళనకారులతో చర్చిందేదే లేదనీ, వారు పాకిస్థాన్ శత్రువులని చెప్పారు.  ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలను పీవోకే   ప్రధాని ఫైసల్ ముంతాజ్ రాథోడ్   ఖండించారు.  కాశ్మీరీలకు మీ సర్టిఫికెట్లు అవసరం లేదంటూ.. అనుచిత వ్యాఖ్యలు చేసిన  ఖవాజా ఆసిఫ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అలాగే.. ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలను ఇండియా కూడా తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ తన సొంత వైఫల్యాలను, మానవ హక్కుల ఉల్లంఘనలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి ప్రచారాలు చేస్తోందని  భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్   ఫైర్ అయ్యారు. దశాబ్దాలుగా పాకిస్థాన్ చేస్తోన్న ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ,  అణచివేత కారణంగానే  పీఓకే ప్రజల ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

Khawaja Asif POK remarks, POK protests 2026, Pakistan Defence Minister controversy, JAAC Rawalakot march, India slams Pakistan POK, Pakistan occupied Kashmir human rights

By
en-us Political News

  
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.