అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి అన్నట్లుగా తయారైంది పాకిస్థాన్ పరిస్థితి. దాదాపు మూడు దశాబ్దాల తరువాత పాకిస్థాన్ ఒక ఐసీసీ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ అవకాశం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసింది. ఈ ఒక్క టోర్నీ నిర్వహణతో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేయయొచ్చని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎన్నో కలలుకంది, ఆశలు పెట్టుకుంది. అయితే ఆ కలలన్నీ కళ్లలయ్యాయి. ఆశలన్నీ అడియాశలయ్యాయి.
భద్రతా కారణాలు, ద్వైపాక్షిక సంబంధాల కారణంగా పాకిస్థాన్ లో మ్యాచ్ లు ఆడేందుకు భారత్ నిరాకరించింది. దీంతో అనివార్యంగా ఈ టోర్నీలో భారత్ అడే మ్యాచ్ లను తటస్థ వేదిక అయిన దుబాయ్ లో నిర్వహించేందుక పీసీపీ అంగీకరించింది. భారత్ వినా మిగిలిన జట్లు ఆడే మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వడానికి దేశంలోని స్టేడియంలను ముస్తాబు చేసింది. వివాదాలకు ఇసుమంతైనా తావు లేకుండా నిర్వహించాల్సిన టోర్నీని పీసీబీ వివాదంతో ప్రారంభించింది. టోర్నీలో పాల్గొనే అన్ని జట్ల జెండాలనూ ప్రారంభ ఉత్సవంలో ప్రదర్శించాల్సి ఉండగా, పీసీబీ భారత్ జెండా లేకుండానే టోర్నీని ప్రారంభించింది. ఇది వివాదం కావడం, అసలు టోర్నీ జరుగుతుందా లేదా అన్న స్థాయికి వెళ్లడంతో పీసీబీ దిగి వచ్చింది.
ఇక అంతర్జాతీయ టోర్నీ నిర్వహణ ద్వారా భారీ ఆదాయం ఉంటుందని ఆశించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు సొంత జట్టు చెత్త ప్రదర్శన కారణంగా పెట్టిన ఖర్చులు కూడా వెనక్కు రాని పరిస్థితి ఎదురైంది. పాక్ జట్టు స్వదేశంలో కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడింది. ప్రారంభ మ్యాచ్ న్యూజిలాండ్ తో ఆడిన పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తరువాతి మ్యాచ్ దుబాయ్ వేదికగా భారత్ తో జరిగింది. ఆ మ్యాచ్ లోనూ పాకిస్థాన్ చెత్త ప్రదర్శనతో కనీసం పోటీ కూడా ఇవ్వకుండా పరాజయం పాలైంది. మూడో మ్యాచ్ మళ్లీ పాకిస్థాన్ లో ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ వర్షార్పణమైంది. దీంతో స్వదేశంలో నిర్వహించిన టోర్నీలో పాక్.. కనీసం నాకౌట్ కు కూడా చేరుకోకుండా పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచింది. దీంతో పాకిస్థాన్ లో జరిగిన మ్యాచ్ లకు ప్రేక్షకులు కరవయ్యారు. 12వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టి స్టేడియంలను ముస్తాబు చేసిన ఖర్చంతా వృధా అయిపోయింది. ఆదాయం మాట దేవుడెరుగు పీసీబీ నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చిన చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో పాకిస్థాన్ ఫైనల్ ఆడటం లేదు.. అసలు పాకిస్థాన్ లోనే ఫైనల్ జరగడం లేదు అని నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఆదివారం (మార్చి 9) భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pakistan-npy-playing-in-final-and-final-match-is-not-in-pakistan-39-194065.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.