బర్రెలకు డైపర్లు... లేదంటే ఆ దేశంలో పన్ను కట్టాల్సిందే

Publish Date:Apr 6, 2026

Advertisement

 

 ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ప్రజలపై మోయలేని భారం పడుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకగా, తాజాగా అక్కడి పంజాబ్ ప్రభుత్వం పశుపోషకులకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ చరిత్రలోనే తొలిసారిగా పశువుల వ్యర్థాలపై 'గోబర్ టాక్స్' (పేడ పన్ను) విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ వినూత్న పన్నును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. పశువుల యజమానులు ప్రతి ఆవు లేదా గేదెకు రోజుకు 30 పాకిస్థానీ రూపాయలను పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం పశుపోషకులను విస్మయానికి గురిచేస్తోంది.

తొలుత ప్రయోగాత్మకంగా లాహోర్‌లోని 168 పశువుల కాలనీలలో ఈ పన్నును అమలు చేయనున్నారు. ముఖ్యంగా హర్బన్స్‌పురా, గుజ్జర్‌పురా వంటి ప్రాంతాల్లోని డెయిరీ నిర్వాహకులపై ఈ భారం పడనుంది. ఈ వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయంతో పారిశుద్ధ్య పనులను మెరుగుపరచడమే కాకుండా, సేకరించిన వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పన్నును 'సుత్రా పంజాబ్' (పరిశుభ్రమైన పంజాబ్) కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్నారు. పశువుల వ్యర్థాల వల్ల నగరాల్లో మురుగునీటి కాల్వలు పూడిపోతున్నాయని, పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని అధికారులు వాదిస్తున్నారు. అందుకే వ్యర్థాల సేకరణ, శుద్ధి కోసం ఈ రుసుమును వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అయితే, ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. "పేడ వేయడానికి కూడా పన్ను కట్టాలా?" అంటూ నెటిజన్లు మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. పది పశువులు ఉన్న రైతు ఏడాదికి వేల రూపాయల భారం భరించాల్సి వస్తుందని, ఇది సామాన్య పశుపోషకులను ఆర్థికంగా దెబ్బతీస్తుందని విమర్శలు వస్తున్నాయి.

ప్రస్తుతం పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర 450 రూపాయలు దాటిపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో పశువులపై పన్నులు విధించడం హేయమని ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. భవిష్యత్తులో ఈ పన్నును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.

By
en-us Political News

  
ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్.. ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ (జేజీఎఫ్)..
బండి భగీరథ్‌‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పనిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు.
బినెట్ ఆమోదం తరువాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 47.60 కిలోమీటర్ల పొడవున ఆరు కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. మచిలీపట్నం , రేపల్లె మధ్య రైల్వేలైన్‌లో మొత్తం 70 బ్రిడ్జిలు, 24 అండర్‌ బ్రిడ్జిలు రానున్నాయి.
రాష్ట్రంలో రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు, ఏపీని డిఫెన్స్ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది.
దీంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ.. డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్(డిఓపిటి)మంత్రిత్వ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపపాలన శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియ జేశారు.
హుస్సేన్ సాగర్ వైపు వెడుతుండగా, దారిలో రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగానే.. పోలీసులకు చెప్పుకుంటే తన కష్టం తీరుతుందేమోనన్న ఆశకలిగింది.
ఈ కేసులో కేటీఆర్ ఎసీబీ కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఆయనను ఏసీబీ విచారించింది. చార్జిషీట్ కూడా ఫైల్ చేసింది. ఆ చార్జిషీట్ ను అనుమతించిన ఏసీబీ కోర్టు కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది.
మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
పశ్చిమ బెంగాల్ ఫలితాలు వెలువడిన అనంతరం శిబ్ పూర్ లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఆ విజయోత్సవ ర్యాలీపై బాంబులు, తుపాకులతో షమీమ్ అహ్మద్ దాడి జరిపించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై కేసు కూడా నమోదైంది.
కేంద్ర భద్రతా సంస్థలు, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ బృందాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే దానిని రన్‌వే నుంచి దూరంగా ఉన్న ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రయాణికులు మరియు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ఈ పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర 110.50 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ ధర రూ. 98.70 కి చేరింది.ఇక ఏపీలోని గుంటూరులో పెట్రోల్‌ లీటర్ రూ. 112.24, డీజిల్ రూ. 100.34కి చేరింది.
హాజీ అలీ నౌక సోమాలియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాకు వెళ్తుండగా బుధవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.