Publish Date:Apr 29, 2025
జమ్ముకాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ భారీ విరాళం విరాళం ప్రకటించింది. పార్టీ తరపున ₹50 లక్షల ఆర్ధిక సహాయం, అలాగే జనసేన పార్టీ ప్రమాద బీమా నుండి ₹5 లక్షల ఇన్సూరెన్స్ తో కలిపి మొత్తంగా ₹55 లక్షలు అందించనున్నామని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ తరుపున ఉగ్ర మృతులకు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి హాజరై ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు.
క్రియాశీలక జనసైనికుడు మధుసూదన రావు కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేమని, కుటుంబపెద్ద అయిన మధుసూదన్ చనిపోవడం బాధకరమని అన్నారు. డబ్బుతో ప్రాణాలకు విలువ కట్టలేమని, కానీ ఈ సాహయం కుటుంబపెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. అంతేగాక ఈ రోజు ఆర్థిక సహాయం చేసి వదిలేయడం కాకుండా మధుసూదన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చిన ఎల్లవేళలా అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pahalgam-terror-attack-25-197152.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.