జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దేశమంతా ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ కీలక పాత్ర పోషించిందనే విమర్శలు వచ్చాయి. క్రీడా సంబంధాలపైనా ఆ ఎఫెక్ట్ పడనుందని.. క్రికెట్ సహా ఇతర క్రీడల్లో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకూడదని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. క్రికెట్లోనూ ఇరు జట్ల మధ్య సిరీస్‌లు జరగడం లేదు. ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. ఈ విషయంలో ఐసీసీ కూడా దృష్టిపెట్టాలని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు.
దీంతో ఆసియా కప్ లోనూ భారత్ పాల్గొనడంపై ఇప్పుడు అనుమానాలు వెల్లువెత్తాయి. టోర్నీని వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.ఆసియా కప్ సాధారణంగా తటస్థ వేదిక పైనే నిర్వహిస్తున్నారు. ఈసారి ఇంకా షెడ్యూల్‌ను ప్రకటించలేదు. బంగ్లాదేశ్ సిరీస్ అనంతరం సెప్టెంబర్‌లో వేదికను నిర్ణయించే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం ఆసియా కప్ వాయిదా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ - పాక్ ల మధ్య ఇప్పుడు సంబంధాలు సరిగ్గా లేవు. ఇలాంటి దశలో నిర్వహించే అవకాశాలు తక్కువేనని క్రికెట్ వర్గాలు అంటున్నాయి
ఆగస్టులో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లను ఆడేందుకు భారత్ అక్కడికి వెళ్లాల్సిఉంది. అయితే, బంగ్లా పర్యటనకూ టీమ్ఇండియా వెళ్లే అవకాశం తక్కువేనని సమాచారం. ఐసీసీ క్యాలెండర్ ఇయర్లో బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు చోటుంది. కానీ, దానిని కొనసాగించే ఛాన్స్‌లు కనిపించడం లేదు. భారత్‌కు సంబంధించిన రాష్ట్రాలపై బంగ్లా నేత చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమని తెలుస్తోందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pahalgam-effect-on-asiacup-cricket-25-197388.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.