కరోనా వైరస్ తో విలవిలలాడుతున్న ప్రపంచానికి పెద్ద ఆశా కిరణంగా కనిపించిన ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌లో తేడా రావడంతో... తాజాగా ప్రపంచవ్యాప్తంగా ట్రయల్స్‌ని తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు తెలిసింది. ప్రపంచంలోనే కరోనాకి బెస్ట్ వ్యాక్సిన్ అని దేశదేశాలు నమ్ముతున్న ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్త్రాజెనెకా ఫార్మా కంపెనీలు సిద్ధం చేసిన వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌ని ఆపివేస్తున్నట్లు ఆస్త్రాజెనెకా కంపెనీ ప్రకటించింది. దీనికి గల ప్రధాన కారణం... బ్రిటన్‌లో ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్న ఒక వాలంటీర్ కు వ్యాక్సిన్ రియాక్షన్ ఇచ్చింది. అయితే ఆ వ్యక్తికీ "తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ వచ్చిందని దీంతో వ్యాక్సిన్ ఇచ్చి దానిపై సమీక్షించే ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది" అని తాజాగా తన స్టేట్మెంట్లో ఆస్త్రాజెనెకా ప్రతినిధి తెలిపారు. దీంతో ఎందుకైనా మంచిదని ట్రయల్స్ తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు ఆస్త్రాజెనెకా ప్రకటించింది. ఈ సైడ్ ఎఫెక్ట్ ఎందుకు వచ్చిందో అప్పుడే చెప్పలేమన్న ఫార్మా కంపెనీ ఆ వ్యక్తి త్వరలో కోలుకుంటారని భావిస్తున్నట్లు చెప్పింది.
అయితే ఈ ట్రయల్స్ నిలిపివేత అన్నది వ్యాక్సిన్ ప్రయోగాలలో సహజంగా జరిగే ప్రక్రియేనని, ట్రయల్స్‌లో కనుక ఎవరికైనా తేడా వస్తే ఇలాగే చేస్తారని.. దీనిపై దర్యాప్తు జరపడం ద్వారా ట్రయల్స్‌పై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేందుకే నిలిపివేసినట్లుగా తెలిపింది. అయితే వ్యాక్సిన్ తయారీ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకుగాను ఇలా ఎందుకు జరిగిందో త్వరగా తెలుసుకుని మళ్ళీ ప్రయత్నిస్తాం" అని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
ఇదే సమయంలో వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ ఇవ్వడం ఏమి చిన్న విషయం కాదంటున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు. ఈ సైడ్ ఎఫెక్ట్ ప్రభావం... ఆస్త్రాజెనెకా వ్యాక్సిన్ తయారీ ఆలస్యం అయ్యేందుకు కారణం కాగలదని వారు అంటున్నారు. అంతేకాకుండా మిగిలిన వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీలు కూడా ఇటువంటి విషయాల్ని సీరియస్‌గా తీసుకోవాలని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇప్పటికే రష్యా తన వ్యాక్సిన్ మొదటి రెండు దశల ట్రయల్స్ పూర్తవగానే వ్యాక్సిన్ తయారైపోయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వ్యాక్సిన్ ఉత్పత్తి వైపు అడుగులు కూడా వేస్తోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం వ్యాక్సిన్ ఏదైనా మూడు దశల్లోనూ మంచిదని తేలితేనే దాన్ని ప్రజలకు అందివ్వాలంటోంది. దీనికి గల ముఖ్య కారణం మూడో దశ ట్రయల్స్ లో ఎక్కువ మందిపై పరీక్షలు జరుగుతాయి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లు లేకపోతె అపుడు వ్యాక్సిన్ సరైనదని చెప్పేందుకు వీలవుతుందని అంటోంది. తాజాగా ఆక్స్ఫర్డ్-ఆస్త్రాజెనెకా వ్యాక్సిన్ కూడా ఈ కారణంగానే... మూడు దశలూ సంపూర్ణంగా పూర్తి చేశాకే... వ్యాక్సిన్ రిలీజ్ చెయ్యాలని నిశ్చయించుకుంది.
ప్రపంచంలో ప్రస్తుతం పలు వ్యాక్సిన్లు మూడో దశ ట్రయల్స్ లో ఉన్నాయి. ఆస్త్రాజెనెకా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌ని అమెరికాలో ఆగస్టులో ప్రారంభించింది. దీంట్లో 30వేల మంది పాల్గొంటున్నారు. అంతకుముందు రెండు, మూడో దశ ట్రయల్స్‌ని బ్రిటన్, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికాలో చేపట్టారు. అయితే మొదటి, రెండో దశల్లో... కొంత మందికి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి వంటి చిన్నచిన్న సమస్యలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం ఓ వ్యక్తికి కాస్త తీవ్ర సమస్యలు రావడంతో ట్రయల్స్ నిలిపివేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/oxford-university-vaccine-trial-paused-25-103853.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.