Publish Date:Jul 20, 2024
గౌరవనీయులైన ఆస్కార్ అవార్డుల అకాడమీ వారికి నమస్కారం. ఈసారి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో మీరు ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి పడితే వాళ్లకి ఇవ్వకుండా, ఒక అంతర్జాతీయ స్థాయి గొప్ప నటుడికి ఇవ్వాలన్న ఉద్దేశంతో మీకు ఈ లేఖ రాయడం జరుగుతోంది. ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో జగన్ అనే ఒక మహా నటుడు వున్నాడు. ఈసారి ఆస్కార్ అవార్డు ఆయనకి ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన సినిమా నటుడు కాదు కదా అనే సందేహం మీకు రావచ్చు.. కానీ, ఆయన సినిమా వాళ్ళకి అమ్మమొగుడు లాంటి నటుడు. అవార్డులకు అర్హత నటనే కావాలిగానీ, సినిమాలు కాకూడదనే అభిప్రాయంతో మీకు ఈ లేఖ రాయడం జరుగుతోంది. దయచేసి ఈసారి అవార్డుల ప్రదానం సందర్భంగా జగన్ అనే మహా నటుడిని పరిగణనలోకి తీసుకోవల్సిందిగా కోరుతున్నాం.
ఏదో అభిమానం కొద్దీ చెప్పడం కాదు.. మీరు కూడా జగన్‌కి సంబంధించిన వీడియోలు గట్రాలు తెప్పించుకుని చూడండి. ముఖ్యంగా గత ఐదేళ్ళ కాలంలో ఆయన నటనా చాతుర్యం చూసి మీరు ముక్కు మీద వేలేసుకుంటారు. లేటెస్ట్ వీడియోలు కావాలంటే, మొన్నటి ఎన్నికల ప్రచారం, ఇంటర్వ్యూలు, రీసెంట్గా నెల్లూరు సెంట్రల్ జైల్‌కి వెళ్ళిన వీడియోలు, శుక్రవారం నాడు వినుకొండ వెళ్ళిన వీడియోస్ చూడండి.. ఆయన ఎంత మహా నటుడో, మీ హాలీవుడ్ నటుల్ని మడతెట్టి పక్కనపెట్టే నటుడో మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా బాబాయ్ మర్డర్ సమయంలో ఆయన మర్డర్ జరిగిన తీరును వివరించిన వీడియో చూశారంటే, మీరు రాబోయే వందేళ్ళపాటు వరుసగా జగన్‌కే ఆస్కార్ అవార్డు ఇచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అసలు మేం మాటల్లో చెప్పిన దానికంటే, మీరు మా జగన్ వీడియోలు సేకరించి చూడండి సార్.. ఇంత మహా నటుడిని ఇంతకాలం మిస్సయిపోయామని మీరే పశ్చాత్తాపపడతారు. మీరు మా జగన్ వీడియోలు చూస్తారని, ఈసారి ఆస్కార్ అవార్డ్స్.లో ఉత్తమ నటుడి అవార్డు మా జగన్‌కి ఇస్తారని ఆశిస్తున్నాం. ఇట్లు మహానటుడు జగన్ అభిమాన సంఘం..
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/oscar-award-to-jagan-39-181147.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.