కృష్ణారెడ్డి ఐపీఎస్.. కృషి ఉంటే యువకులు ఐపీఎస్ లు అవుతారు!

Publish Date:Apr 29, 2025

Advertisement

ఒక సాధారణ కానిస్టేబుల్ గా జీవితం ప్రారంభించి.. ఐపీఎస్ గా ఎదగడం మామూలు విషయం కాదు. అందరికీ సాధ్యమయ్యే విషయం అసలే కాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు  ఉదయ కృష్ణారెడ్డి. అందుకే, స్వయం కృషికి సజీవ రూపంగా నిలిచే, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయ కృష్ణారెడ్డిని అభినందించారు. కన్న కలలను సాకారం చేసుకున్న కృష్ణా రెడ్డి.. కలలు కనండి , కన్న కలలను సాకారం చేసుకోండి, అన్న మరో మహనీయుడు, ప్రాతః స్మరనీయుడు, మాజీ రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్ కలాంను కూడా  గుర్తుకు తెచ్చారు. ఆ విధంగానూ కృష్ణా రెడ్డి  అభినందనీయుడు. 

అవును. చంద్రబాబు నాయుడు తమ అభినందన సందేంలో అన్నట్లుగా  ఒక సాధారణ కానిస్టేబుల్ గా జీవితాని ప్రారంభించి  ఐపీఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగిన కృష్ణా రెడ్డి జీవితం యువతకు ఒక ఆదర్శం. నిరంతర పరిశ్రమతో, కృషి, పట్టుదలను తోడు చేసుకుని ధైర్యంగా ముందుకు సాగితే ఎలాంటి కలైనా  సాకారం అవుతుందని.. ఎంతటి అవరోధాలనైనా అతిక్రమించ వచ్చునన్న సత్యాన్ని కృష్ణా రెడ్డి మరోమారు నిరూపించారు. అవును..  ముఖ్యమంత్రి అనంట్లుగా ఓటమిని అంగీకరించని వారిదే భవిష్యత్ అని మరో నిరూపించిన, కృష్ణా రెడ్డి  ఐపీఎస్ నిజంగా అభినందనీయుడు. ఎవరీ కృష్ణా రెడ్డి, ఏమా కథ? అంటే.. 

ప్రకాశం జిల్లాలోని ఉల్లపాలెం గ్రామానికి చెందిన ఎం. ఉదయ కృష్ణారెడ్డి సివిల్ సర్వీసెస్ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 350 ర్యాంకు సాధించి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లో స్థానం సంపాదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి అభినందనలు అందుకున్నారు. కలలు కనండి ...కన్న కలలను సాకారం చేసుకోండి  అన్న మాజీ రాష్ట్రపతి ఎపీజే అబ్దుల్ కలాం  సందేశానికి  సజీవ రూపంగా నిలిచిన  ఉదయ కృష్ణారెడ్డి 2013లో,ఏపీ పోలీస్ డిపార్టుమెంటులో  కానిస్టేబుల్‌గా చేరారు. గుడ్లూరు, రామాయపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. అదే సమయంలో, ఉన్నతాధికారి నుంచి ఎదురైన అవమానాలు అతనిలో ఐపీఎస్  కావాలనే ఆకాంక్షను రగిల్చాయి. ఆ అధికారి చేసిన అవమానమే అతనిలో అశయాన్ని రగిల్చింది.

 పేదరికంలో పుట్టి..  చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఉదయకృష్ణారెడ్డిని అతని అమ్మమ్మ రమణమ్మ పెంచింది. కూరగాయలు అమ్ముకుని పొట్ట పోసుకునే  రమణమ్మ, మనవడిని పెంచి పెద్ద చేసింది. అలాగే, అతని మామ కోటి రెడ్డి చేయూత నిచ్చారు. చేయి పట్టి నడిపించారు. అటు అమ్మమ్మ రమణమ్మ,ఇటు మేన మామ కోటి రెడ్డి ఇచ్చిన చేయూతతో, కృష్ణారెడ్డి  2013లో ఏపీ పోలీస్ డిపార్టుమెంటులో  కానిస్టేబుల్‌గా చేరారు. అయితే ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా ఉన్నతాధికారి చేసిన అవమానాలకు సమాధానంగా ఐఏఎస్ కావాలని సంకల్పం చెప్పుకున్న, కృష్ణారెడ్డి, 2018 లో సివిల్ సర్వీసెస్ పూర్తి సమయం కోసం కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. మూడు ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, పట్టు వదలని విక్రమార్కునిలా  మరో ప్రయత్నం చేశారు. ఈసారి 780 వ ర్యాంక్ వచ్చింది. ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ లో ఉద్యోగం వచ్చింది. అయినా, ఐపీస్  కావాలనే, ఆశయాన్ని చంపుకోలేదు. కల అంటే నిద్రలో వచ్చేది కాదు... నిద్ర పోనివ్వకుండా చేసేది కల   అన్న   కలాం స్పూర్తితో  రైల్వే సర్వీస్  శిక్షణ సమయంలో మరోమారు సివిల్స్ రాశారు. 350వ ర్యాంక్ సాధించారు. ఐపీఎస్ కల సాకారం చేసుకున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

 ఇప్పుడు ఉదయ కృష్ణా రెడ్డి. ఐపీఎస్.. భారతీయ యువత లో అపారమైన సామర్ధ్యం ఉందని, ఆత్మ స్థైర్యంతో ఓటమిని అంగీకరించకుండా ముందుకు సాగితే విజయం తధ్యమని విశ్వాసం వ్యక్త పరిస్తున్నారు. అమ్మమమ రమణమ్మ, మామయ్య కోటి రెడ్డి తన జీవితాన్ని తీర్చి దిద్దారని అన్నారు.అలాగే, తన ప్రయాణంలో సహకరించిన  మెంటర్స్,కు కృతజ్ఞతలు తెలిపారు.  అన్నివిధాల తండ్రిలా ఆడుకున్నఅదనపు డీజీ మహేష్ భగవత్‌కు ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపారు.

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.