క్లాసిన్ క్లాసిక్ ఇన్నింగ్స్.. వాంఖడేలో ఎస్ఆర్ హెచ్ చేతిలో ముంబై చిత్తు

Publish Date:Apr 29, 2026

Advertisement

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబైలోని చారిత్రక వంఖేడే స్టేడియం వేదికగా బుధవారం (ఏప్రిల్ 29) జరిగిన మ్యాచ్ లో  సన్‌రైజర్స్ హైదరాబాద్   అద్భుత విజయాన్ని అందుకుంది. పరుగుల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేస్తూ ఆరెంజ్ ఆర్మీ సత్తా చాటింది.  కీలకమైన ఈ పోరులో సన్‌రైజర్స్ బ్యాటర్లు లో విరుచుకుపడి భారీ లక్ష్యాన్ని ఛేదించి, ప్లేఆఫ్స్ దిశగా మరో అడుగు ముందుకేశారు. 

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోరును సాధించింది. ముంబై ఓపెనర్ రియాన్ రికెల్టన్  స్టేడియంలో సిక్సర్ల సునామీ సృష్టించాడు. కేవలం 44 బంతుల్లోనే శతకాన్ని బాది, ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రికెల్టన్ 123 పరుగులతో అజేయంగా నిలిచి ముంబైకి కొండంత స్కోరును అందించాడు. అతనికి తోడుగా విల్ జాక్స్ ఆరంభంలో మెరుపులు మెరిపించడంతో ముంబై భారీ స్కోరు దిశగా సాగింది.

అయితే..  244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏమాత్రం తడబడలేదు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మరోసారి జట్టుకు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లేలో  ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగి రన్ రేట్‌ను ఆకాశానికి తీసుకెళ్లారు. ట్రావిస్ హెడ్ తనదైన శైలిలో బౌండరీల వర్షం కురిపించగా, మిడిల్ ఓవర్లలో హెన్రిచ్ క్లాసెన్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ముంబై బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ క్లాసెన్ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్‌ను హైదరాబాద్ వైపు తిప్పింది.

చివరి ఓవర్లలో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారినప్పటికీ, నితీష్ కుమార్ రెడ్డి,  క్లాసెన్ సమన్వయంతో ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా  సహా బౌలర్లందరూ విఫలమయ్యారు.   చివరికి సన్‌రైజర్స్ 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకా ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించి 6 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది.  

ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు  సంక్లిష్టంగా మారాయి. వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబైకి ఈ మ్యాచ్ గెలవడం అత్యంత ఆవశ్యకం అయినప్పటికీ, క్లాసెన్ విధ్వంసం ముందు వారి పోరాటం సరిపోలేదు. మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ వరుస విజయాల పరంపరను కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో టాప్3కి చేరింది.   

By
en-us Political News

  
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.