ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుతున్న ఐటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్ డ్ టెక్నాలజీస్ లో యువతకు శిక్షణఇచ్చి, వర్క్ ఫోర్స్ ను సిద్ధం చేయడానికి ప్రఖ్యాత సంస్థ ఒరాకిల్ తో కూటమి సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒరాకిల్, ఎపిఎస్ఎస్డీసి ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. దీనిద్వారా ఎంపిక చేసిన యువతకు ఒరాకిల్ యూనివర్సిటీ లెర్నింగ్ సబ్ స్క్రిప్షన్ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతలో ఒరాకిల్ క్లౌడ్ నైపుణ్యాల కోసం చేయూత అందించడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. తొలిఏడాది లక్షమందికి, రెండు, మూడు సంవత్సరాల్లో లక్షన్నర మందికి చొప్పున మొత్తం 4లక్షలమందికి ఒరాకిల్ మై లెర్న్ డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా శిక్షణ ఇస్తారు. ఒరాకిల్ క్లౌడ్ ఎసెన్షియల్స్, ఓసిఐ ఫౌండేషన్స్, ఎఐ ఫౌండేషన్స్, డేటా సైన్స్, క్లౌడ్ సెక్యూరిటీ క్యూరేటెడ్ లెర్నింగ్ పాత్స్ పై శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి.
అప్ డేటెడ్ వర్షన్స్ లో గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ల కోసం లెర్నింగ్ కంటెంట్ ను ఎప్పటికప్పుడు నవీనీకరణ చేసి అభ్యర్థులకు అందిస్తారు. అదనపు మద్దతు, నెట్ వర్కింగ్ కోసం ఒరాకిల్ యూనివర్సిటీ కమ్యూనిటీలో అభ్యర్థులకు యాక్సెస్ కూడా లభిస్తుంది. ఒరాకిల్ ఇన్ హౌస్ బృందం అభివృద్ధి చేసిన ఈ కోర్సులను నేర్చుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒరాకిల్ అందించే ఎస్ డిఐ సేవలను అభ్యర్థులు నమోదు చేసుకోవడానికి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా వెబ్ సైట్ రూపొందిస్తుంది. ఒరాకిల్ నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు లోబడి అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్ డీసీ ఎండి & సిఇఓ గణేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ దినేష్ కుమార్, ఒరాకిల్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శైలేంద్రకుమార్, సీనియర్ సేల్స్ డైరక్టర్ దేబప్రియ నందన్, వైస్ ప్రెసిడెంట్ (జపాక్ స్కిల్ డెవలప్ మెంట్) తపస్ రాయ్, టెరిటరీ సేల్స్ మేనేజర్ షకీల్ అహమ్మద్ మొహమ్మద్, ప్రిన్సిపాల్ క్లౌడ్ ఆర్చిటెక్ట్ వెంకటశివ నక్కా, కంట్రీ హెడ్ అశ్లేష ఖండేపార్కర్ తదితరులు పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/oracle-39-197507.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.